Home /News /international /

TRAINEE PILOT DIED AFTER MOSQUITO BITE TO FOREHEAD PVN

OMG : షాకింగ్..దోమ కుట్టడం వల్ల ట్రైనీ పైలట్ మృతి

దోమ కాటుతో ట్రైనీ పైలట్ మృతి

దోమ కాటుతో ట్రైనీ పైలట్ మృతి

Trainee Pilot Died After Mosquito Bite : విష సర్పాలు లేక ఏదైనా విష కీటకాలు చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం. కానీ కేవ‌లం దోమ కాటుతో(Mosquito Bite)మ‌ర‌ణించారాని మీరు ఎప్పుడైనా విన్నారా ? చిన్న దోమనే కదా అని లైట్‌ తీసుకున్నారా?అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకవాల్సిందే.

ఇంకా చదవండి ...
  Trainee Pilot Died After Mosquito Bite : విష సర్పాలు లేక ఏదైనా విష కీటకాలు చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం. కానీ కేవ‌లం దోమ కాటుతో(Mosquito Bite)మ‌ర‌ణించారాని మీరు ఎప్పుడైనా విన్నారా ? చిన్న దోమనే కదా అని లైట్‌ తీసుకున్నారా?అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకవాల్సిందే. దోమ కారణంగా ఓ ట్రైనీ పైలట్‌(Trainee pilot) మృతి చెందింది. ఈ విషాద ఘటన బ్రిటన్‌ లో చోటుచేసుకుంది. అయితే ఏడాది క్రితం పైలట్‌ మృతిచెందగా రిపోర్ట్ తాజాగా బయటకు వచ్చింది.

  బ్రిటన్ లోని సఫల్క్ కి చెందిన ఒరియానో పెప్ప‌ర్ (Oriana Pepper)ట్రైనీ పైలెట్ గా పనిచేసేది. ఒరియానా పెప్పర్... తన శిక్షణలో భాగంగా మే 2021లో బెల్జియంలోని యాంట్‌ వెర్ప్‌కు వెళ్లింది. అయితే ఆమె శిక్షణలో భాగంగా విమానం నడుపుతున్న సమయంలో పలుసార్లు దోమలు ఆమె మెఖంపై కుట్టాయి. దోమకాటు కారణంగా కంటి పై చిన్న వాపు కనిపించింది. మొదట్లో కుటుంబ సభ్యులతో పాటు సదరు యువతి కూడా ఆ వాపును లైట్ తీసుకుంది. కానీ క్రమక్రమంగా వాపు పెరిగిపోతూ రావడంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఒరియానోకి దోమకాటు కారణంగానే ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చిని చెప్పిన డాక్టర్లు...యాంటిబ‌యోటిక్స్ ఇచ్చి ఆమెను ఇంటికి తిరిగి పంపారు. అయితే ఆ తర్వాత రెండు రోజుల‌కు జులై 9,2021న ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. సాధార‌ణ ప‌నులు చేసుకుంటుండ‌గా స్పృహత‌ప్పి ప‌డిపోయింది. దీంతో ఆమెను మ‌ళ్లీ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆరోగ్యం విషమంగా మారి జులై 12,2021న చనిపోయింది. కాగా, ఆమె మృతి మిస్టరీ కావడంతో డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. తాజాగా నివేదికను వెల్లడించారు. ఈ రిపోర్ట్ లో షాకింగ్ విష‌యాలు వెలుగు చూశాయి. దోమకాటు కారణంగానే శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరడంతో చివరికి సదరు యువతి మృతి చెందిందని ఇటీవల విడుదలైన నివేదిక చెబుతోంది. కొద్ది మందికే ఇలా జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. చిన్న వయస్సులో ఆమె ఇలా దోమకాటుతో చనిపోవడం బాధాకరమని డాక్టర్లు అన్నారు.  Big Breaking : జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు..పరిస్థితి విషమం!  మరోవైపు, వర్షాకాలం మొదలవ్వడం నుంచి దోమలు, ఈగల బెడద కూడా మొదలవుతుంది. మలేరియా ,డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. వెల్లుల్లి బలమైన మసాలా వాసన దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు వెల్లుల్లి కొన్ని రెబ్బలను చూర్ణం చేసి వాటిని నీటిలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత ద్రావణాన్ని చల్లబరచండి. ఇప్పుడు ఈ నీటిని ఇంటి చుట్టూ పిచికారీ చేయండి. ప్రత్యేకించి దోమలు దాగి లేదా లోపలికి వచ్చే ప్రదేశాలలో. మూలలు, కిటికీలు, తలుపులు, బాల్కనీ తోటల చుట్టూ స్ప్రే చేయండి వాసన ఇంటి అంతటా వ్యాపించనివ్వండి. ఇక,కర్పూరం వాసన దోమలకు విపరీతంగా ఉంటుంది. వాటిని తరిమికొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. అన్ని కిటికీలు ,తలుపులు మూసివేసి కర్పూరం బిళ్లను కాల్చండి. ఈ పొగ దోమలను దూరం చేస్తుంది.మీరు ఒక గిన్నె నీటిలో కర్పూరం టాబ్లెట్‌ను కూడా వేయవచ్చు. కొన్ని రోజులకు అందులో నీటిని మార్చండి. కానీ పిల్లలు ,పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా ఉంచాలని గుర్తుంచుకోండి.

  IRCTC Thailand Tour : రూ.40 వేలకే థాయిలాండ్ ట్రిప్..IRCTC స్పెషల్ ప్యాకేజీ వివరాలివే

  మరోవైపు,తులసిలోని సహజ సువాసన దోమలను తరిమికొడుతుంది. కిటికీల దగ్గర అనేక తులసి మొక్కలను ఉంచండి. ఈ మూలిక దోమలను దూరంగా ఉంచుతుంది. దోమల కాటుకు చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది.మీరు కొన్ని ఆకులను చూర్ణం చేయవచ్చు లేదా కషాయాన్ని తయారుచేయడానికి వాటిని నీటిలో ఉడకబెట్టవచ్చు. ఈ నీటిని మీ చర్మంపై లేదా ఇంటి చుట్టూ స్ప్రేగా ఉపయోగించండి. ఈ ఆకులు దోమలను వెంటనే తరిమేస్తాయి. ఇక, కొన్ని నిమ్మకాయలను సగానికి ముక్కలుగా చేసి వాటిలో కొన్ని లవంగాలను అతికించండి. ఈ టెక్నిక్ ఈగలు ,దోమలను దూరంగా ఉంచడానికి ఉత్తమ ఉపాయాలలో ఒకటిగా పనిచేస్తుంది. వాటిని ప్రతి గదిలో ఉంచండి మీ ఇంటిని దోమలు లేకుండా చూసుకోండి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ట్రిక్‌ను తన అమ్మమ్మ ఎలా ఉపయోగించారో ప్రస్తావిస్తూ పంచుకున్నారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Died, Mosquito, Pilot

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు