Train Accident: పాకిస్థాన్... సింధు ప్రాంతంలోని... ఘోత్కీ జిల్లాలో... ధార్కీ దగ్గర ఈ ఉదయం 2 ప్యాసింజర్ రైళ్లు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే 30 మంది చనిపోగా... మరో 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. రిపోర్టుల ప్రకారం... మిల్లత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్... సిర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్... ఢీకొన్నాయి. వీటిలో సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్... లాహోర్ నుంచి కరాచీ వెళ్తోంది. ఈ రైలు పట్టాలు తప్పడమే కాక... పక్క ట్రాక్‌పై కరాచీ నుంచి సర్గోధా వస్తున్న రైలును ఢీకొట్టింది. దాంతో... మిల్లత్ రైలు బోగీలు... పల్టీలు కొట్టి బోల్తాపడ్డాయి. వెంటనే ఘోత్కీ, ధార్కీ, ఒబారో, మీర్పూర్ మథేలో ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాంతో డాక్టర్లు, నర్సులూ అందరూ సర్వీస్ అందించేందుకు రెడీ అయ్యారు. పారామెడికల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అందరూ ఆన్‌డ్యూటీ అయ్యారు.
ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కానీ... అవి వేగంగా సాగట్లేదు. ఎందుకంటే రైలు బోగీలు బోల్తాపడటంతో... రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. అందుకే మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది అని ఘోత్కీ డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు.
Today Train Accident: Millat Express Derailed and Collided with Sir Syed Express Near Reti (Deharki) pic.twitter.com/HLeVpI9GAa
— ا و ی س! ?? (@_Avvais) June 7, 2021
ఉస్మాన్ అబ్దుల్లా జియో న్యూస్‌తో మాట్లాడుతూ... "మొత్తం 13 లేదా 14 బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో 8 పూర్తిగా సర్వనాశనం అయ్యాయి. ఇప్పటికీ చాలా మంది వాటిలో చిక్కుకున్నారు. వాళ్లను కాపాడటం కష్టంగా ఉంది" అన్నారు.
రోహ్రీ నుంచి మరో రిలీఫ్ ట్రైన్‌ను తెప్పిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికి ముగుస్తుందో తెలియట్లేదు. "ఇదో ఛాలెంజింగ్ టాస్క్. చాలా టైమ్ పడుతుంది. భారీ యంత్రాలతో చెయ్యాలి. అప్పుడే లోపల చిక్కుకున్న వాళ్లను కాపాడగలం. ప్రస్తుతం జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు" అని ఉస్మాన్ అబ్దుల్లా అన్నారు. మేము ఓ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటుచేసాం. దాని ద్వారా ప్రయాణికులకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం అని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Old Rs.5 Note: ఆ పాత రూ.5 నోటు మీ దగ్గర ఉందా... ఐతే... రూ.30 వేలు మీవే...
ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి... మొత్తం మృతులు ఎంత మంది... ఇంకా ఎంత మంది గాయపడ్డారు అనేది ఇప్పుడే క్లారిటీ రాదు. మధ్యాహ్నానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, Viral