Tragedy : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మృత్యుకేళీ.. డేంజరస్ గ్యాస్ పీల్చి 8 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

Tragedy : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ల్లో దారుణం జరిగింది. విష వాయువు దెబ్బకి ఎనిమిది మంది బలయ్యారు. ఈ ఘటన బోస్నియా దేశంలోని నైరుతి ప్రాంతంలో జరిగింది. బోస్నియా రాజధాని సారాజేవోకి నైరుతిగా 90 కి.మీ దూరంలోని ట్రిబిటోవో గ్రామంలో ఓ కాటేజీలో యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

  • Share this:
    న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ల్లో దారుణం జరిగింది. విష వాయువు దెబ్బకి ఎనిమిది మంది బలయ్యారు. ఈ ఘటన బోస్నియా దేశంలోని నైరుతి ప్రాంతంలో జరిగింది. బోస్నియా రాజధాని సారాజేవోకి నైరుతిగా 90 కి.మీ దూరంలోని ట్రిబిటోవో గ్రామంలో ఓ కాటేజీలో యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రమైన చలి ఉండటంతో.. వెచ్చదనం కోసం పవర్ జనరేటర్ ను ఆన్ చేయగా కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు లీకైంది. ఆ గ్యాస్ ను పీల్చడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా యువకులు, విద్యార్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. కాటేజీలో పలువురు మృతి చెందినట్లు ఉదయం 10 గంటలకు సమాచారం అందిందని స్థానికి పోలీస్ అధికారి మార్టినా మెడిక్ తెలిపారు.

    ఈ ఘటన జరగడంతో ట్రిబిటోవో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయ్. విద్యార్ధుల మృతికి సంతాపంగా స్థానిక కాఫీ షాపులు, రెస్టారెంట్ల యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసివేసి బంద్ పాటించారు. కార్బన్‌ మోనాక్సైడ్‌ డేంజరస్ గ్యాస్. ఇది వాసన, రంగు, రుచి లేని వాయువు. ఈ గ్యాస్ పీల్చిన వారు వెంటనే అనారోగ్యానికి గురై మృతి చెందే అవకాశముంది.
    Published by:Sridhar Reddy
    First published: