హెవీ ట్రాఫిక్‌లో రోడ్డు దాటిన భారీ అనకొండ... వీడియో వైరల్...

హైవే మీద కనిపించిన 10 అడుగుల పొడవు, 30 కిలోలకు పైగా బరువు ఉండే ఆకుపచ్చ అనకొండ... బ్రెజిల్‌లోని పోర్టో వెల్మో ఏరియాలో సంఘటన..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 6:19 PM IST
హెవీ ట్రాఫిక్‌లో రోడ్డు దాటిన భారీ అనకొండ... వీడియో వైరల్...
ట్రాఫిక్‌లో రోడ్డు దాటిన భారీ అనకొండ... వీడియో వైరల్...
  • Share this:
అదో హైవే... వాహనాలన్నీ యమా స్పీడులో దూసుకుపోతున్నాయి. అక్కడ ఓ భారీ అనకొండు ప్రత్యేక్షమైంది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న భారీ అనకొండను చూసి వాహనదారుల గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొందరు సర్పాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. బ్రెజిల్‌లోని పోర్టో వెల్మో ఏరియాలో ఓ ఆకుపచ్చ అనకొండ... హైవే మీదికొచ్చింది. హెవీ ట్రాఫిక్ దాటుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసింది. దాదాపు 10 అడుగుల పొడవు, 30 కిలోలకు పైగా బరువు ఉండే ఈ ఆకుపచ్చ అనకొండ... ఆహారం కోసం వెతుకుతూ ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైవే మీద సడెన్‌గా భారీ పామును చూసి షాకైన కొందరు వాహనదారులు... వాహనాలకు ఆపి, అనకొండ రోడ్డు దాటేందుకు సహకరించారు. కొందరు పాదచారులు, ఈ పామును గమనించి వీడియో తీశారు. వాహనాలను ఆపి, పాము రోడ్డు మొత్తం దాటేదాకా వేచి చూశారు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

కుక్కలు, పిల్లులు, ఎలుకలను తినే ఈ అనకొండలు... వాటి కదలికలను చాలా దూరం నుంచే గుర్తిస్తాయి. ఎలుకలు ఉన్నచోటుకు ఇలా వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. వీటి వల్ల మనుషులకు పెద్దగా ప్రాణహాని లేకపోయినా... వర్షాకాలంలో ఇవి ఇళ్లల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు బయోలాజిస్టులు.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

First published: May 1, 2019, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading