Lunar Cruiser : చంద్రుడిపై(Moon)మనిషి మనుగడ సాధ్యమా?కాదా అని తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతునే ఉన్నాయి. పరిశోధనల్లో భాగంగా చంద్రుడిపైకి ఎన్నోసార్లు రాకెట్లను పంపించినప్పటికీ మనిషి మనుగడకు కావలసిన అన్ని పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కచ్చితత్వంతో తెలుసుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తు వినూత్న ప్రయత్నాలు చేయడానికి మొదలు పెడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక సరికొత్త వాహనాన్ని రూపొందించేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా(Toyota) రెడీ అయ్యింది. ఇందుకోసం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ( Japan Aerospace Exploration Agency)తో కలిసి టయోట పనిచేస్తున్నట్లు సమాచారం. 2040 నాటికి చంద్రుడిపైన,అంగారకుడిపైన ప్రజలు నివసించడానికి అన్ని పరిస్థితులను అన్వేషించడమే దీని ముఖ్య ఉద్దేశం.
చంద్రుడిపైకి పంపేందుకు రెడీ చేస్తున్న కారుకి "లూనార్ క్రూజర్(Lunar Cruiser)" అని పేరు పెట్టింది టయోట. టయోటా చంద్రుడిపైకి పంపాలి అనుకుంటున్న కారులో ప్రజలను సురక్షితంగా తినడం, పని చేయడం,ఇతరులతో కమ్యూనికేషన్ కూడా చేయగలరట. రోదసీలో తనిఖీలు నిర్వహణ పనుల వంటివి చేపట్టేందుకు ఈ కారుకి ఒక రోబోటిక్ హస్తాన్ని కూడా అమర్చనున్నారు. గిటాయ్ జపాన్ అనే సంస్థ ఈ రోబోటిక్ హస్తాన్ని దీన్ని రూపొందించింది. భిన్న పనులను సులువుగా చేపట్టగలిగేలా ఈ సాధనం అంచులను మార్చుకోవచ్చు. దీనిపై గిటాయ్ సీఈవో షో నకానోస్ మాట్లాడుతూ.."మొన్నటివరకు రోదసీలోకి వెళ్లడమే సవాల్ గా ఉండేది. ఇప్పుడు దాన్ని మనం అధిగమించాం. అయితే అంతరిక్షంలో పనిచేయడం వ్యోమగాములకు ప్రమాదకంగా మారింది. దీనికయ్యే ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఇబ్బందిని ఈ రోబోలు తీరుస్తాయి" అని తెలిపారు. చంద్రుడిపై కాలు పెట్టి సరికొత్త అన్వేషణ సాగించాలని తయారవుతున్నా లూనార్ క్లోజర్ వాహనం ఇక ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ALSO READ Mompha jnr: 9 ఏళ్ల బుడ్డోడు.. వేల కోట్ల ఆస్తులు.. సొంత విమానం.. అసలెవరీ బాలుడు..?
మరోవైపు,చంద్రుడిపై పరిశోధనలకు జపాన్ లో ఆశక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఐస్పేస్ అనే ప్రైవేటు సంస్థ రోవర్ లు,ఆర్బిటర్ లు,ల్యాండర్ లపై పనిచేస్తోంది. ఈ ఏడాది చివర్లో చంద్రుడిపై ల్యాండింగ్ నిర్వహణకు ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.