news18-telugu
Updated: October 20, 2019, 10:42 PM IST
సౌదీలో బస్సు ప్రమాదం
సౌదీ అరేబియాలోని మక్కాలో గత బుధవారం భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 35 మంది విదేశీయులు చనిపోయారు. ఆ బస్సులో 9 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. మక్కా వెళ్తున్న సమయంలో ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది చనిపోయినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే, బస్సులో ఉన్న 9 మంది భారతీయుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మిగిలిన ఏడుగురి కోసం ఆరా తీస్తున్నారు. ‘ఆ బస్సులో వెళ్లిన యాత్రికుల వివరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ బస్సులో భారత పాస్ పోర్ట్ ఉన్న వారు ఉన్నట్టు స్థానిక అధికారులు మాకు తెలిపారు.’ అని కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేశారు. మిస్ అయిన ఆ ఏడుగురి వివరాలు.. అష్ఫ్రఫ్ ఆలం (బీహార్), ఫిరోజ్ అలీ, అఫ్తాబ్ అలీ, నౌషద్ అలీ, జీషాన్ ఖాన్, బెలాల్ (వీరంతా యూపీ), మక్తార్ అలీ ఘాజీ (పశ్చిమ బెంగాల్). మాటిన్ గులామ్ వాలాలే, జీబా నిజాం బాగ్బన్ (మహారాష్ట్ర) గాయపడ్డారు. వారు ప్రస్తుతం సౌదీలోని కింగ్ ఫహద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మా చెల్లి మీద చెయ్యేస్తావా?.. యువకుడిని రఫ్ఫాడించిన యువతి
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 20, 2019, 10:41 PM IST