హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Indonesia Bus Accident: అర్ధరాత్రి ఘోరం.. అదుపుతప్పిన 65 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 27 మంది మృతి

Indonesia Bus Accident: అర్ధరాత్రి ఘోరం.. అదుపుతప్పిన 65 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 27 మంది మృతి

అర్ధరాత్రి ఓ దారుణం జరిగింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణను కోల్పోయాడు. ఫలితంగా ఆ బస్సు లోయలో పడిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 65 అడుగుల లోతులో ఆ బస్సు పడిపోయింది. ఫలితంగా..

  కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి విహారయాత్రను ప్లాన్ చేశారు. మధ్యలో ప్రఖ్యాత దేవాలయాలను కూడా దర్శించుకునేలా టూర్ ను సిద్ధం చేశారు. మొత్తం 62 మంది ప్రయాణికులతో ఆ బస్సు తీర్థయాత్రను కొనసాగిస్తోంది. సడన్ గా అర్ధరాత్రి ఓ దారుణం జరిగింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణను కోల్పోయాడు. ఫలితంగా ఆ బస్సు లోయలో పడిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 65 అడుగుల లోతులో ఆ బస్సు పడిపోయింది. ఫలితంగా 27 మంది దుర్మరణం చెందారు. 35 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని జువాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోనేషియాలోని పశ్చిమ జువాలోని ఇస్లామిక్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్ర ప్లస్ విహారయాత్రను ప్లాన్ చేసుకున్నారు.

  అందుకోసం ఓ టూరిస్ట్ బస్సును కూడా బుక్ చేసుకున్నారు. డ్రైవర్ తో సహా మొత్తం 62 మందితో కూడిన బస్సు ఆ విహారయాత్రను చుట్టి వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం సుమేడాంగ్ జిల్లాలో కూడా పలు సందర్శనీయ ప్రాంతాలను చూశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రైవర్ బస్సుపై నియంత్రణను కోల్పోయాడు. బస్సు బ్రేకులు సరిగి పనిచేయకపోవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. ఫలితంగా ఆ బస్సు 65 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. 35 మందికి గాయాలయ్యాయి. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉందని వైద్యులు తెలిపారు.

  ఇది కూడా చదవండి: పెళ్లయి ఐదుగురు పిల్లలు ఉన్న మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి.. ఇంటి ముందున్న గుంటలో బయటపడిన బండారం..!

  ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ ఏజెన్సీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి వారిని తరలించారు. కాగా, ప్రమాదం గురించి తెలిసి, గాయపడిన, మరణించిన వారి బంధువులు ఆ ఆసుపత్రికి క్యూ కట్టారు. తమ వారికి ఏం జరిగిందా అన్న భయంతో అక్కడకు చేరుకున్నారు. కాగా, ఇండోనేషియాలో రోడ్లు సరిగా ఉండకపోవడమే ఈ ప్రమాదానికి కారణమనీ, అందుకే ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

  ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

  First published:

  Tags: Boat accident, Bus accident, Crime news, Crime story, CYBER CRIME, Fire Accident

  ఉత్తమ కథలు