ఆ 63 మంది భారతీ బిలియనీర్ల సంపద... కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ...

భారత్ లాంటి దేశాల్లో సంపన్నులు ఎక్కువ అవ్వడం మంచి పరిణామం కాదంటోంది ఆక్స్‌ఫామ్ రిపోర్ట్. సంపన్నులు పెరిగితే... పేదలు, సంపన్నుల మధ్య దూరం మరింత పెరుగుతుందనీ, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరింత పేదలు అవుతారని ఆ రిపోర్ట్ చెబుతోంది.

news18-telugu
Updated: January 20, 2020, 11:16 AM IST
ఆ 63 మంది భారతీ బిలియనీర్ల సంపద... కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ...
ఆ 63 మంది భారతీ బిలియనీర్ల సంపద... కేంద్ర బడ్జెట్ కంటే ఎక్కువ...
  • Share this:
భారత్‌లో అత్యంత సంపన్నులుగా ఉన్న 1 శాతం మంది దగ్గర ఉన్న డబ్బు... దేశంలో అట్టడుగున్న ఉన్న 70 శాతం మంది ప్రజల (95.3 కోట్ల మంది) దగ్గర ఉన్న డబ్బు కంటే... నాలుగు రెట్లు ఎక్కువ అంటే నమ్మగలరా? భారత్‌లోని బిలియనీర్ల మొత్తం డబ్బు... కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే ఎక్కువని తాజాగా తేలింది. దావోస్‌లో 50వ వార్షిక ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - WEF) జరుగుతున్న సందర్భంగా... టైమ్ టు కేర్ పేరుతో ఓ అధ్యయన రిపోర్టును రిలీజ్ చేసింది ఆక్స్‌ఫామ్ సంస్థ. ఆ రిపోర్ట్ ప్రకారం... ప్రపంచంలో 2153 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద ఈ ప్రపంచంలోని 60 శాతం మంది ప్రజల (460 కోట్ల మంది) దగ్గర ఉన్న సంపద కంటే ఎక్కువే. ఆ రిపోర్ట్ ఓ భయంకరమైన వాస్తవాన్ని బయటపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ధనవంతులూ, పేదవాళ్ల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. గత దశాబ్ద కాలంలో... బిలియనీర్ల సంఖ్య డబుల్ అయ్యింది. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదంటోంది ఆక్స్‌ఫామ్.

ప్రపంచ ఆర్థిక సదస్సులు ఎన్ని జరిగినా... పేద, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించనంతవరకూ అలాంటివి జరిపి లాభం లేదంటోంది ఆక్స్‌ఫామ్. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చెయ్యాలంటోంది. సోమవారం నుంచీ ఐదు రోజులపాటూ జరిగే సదస్సులో ఇలాంటి అంశాల్ని జనరల్‌గానే చర్చిస్తారు. కానీ... ఫలితం కనిపించట్లేదు. ఏటా పేదలు మరింత పేదలవుతుంటే... ధనవంతులు మరింత కుభేరులు అవుతున్నారు. 2019లో ఈ వైరుధ్యం మరింత ఎక్కువగా కనిపించింది.

ఓవైపు కడుపు కాలి ఓ వర్గం ఏడుస్తుంటే... మరోవైపు ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక మరో వర్గం ఏడుస్తున్న పరిస్థితుల వల్ల... దాదాపు అన్ని ఖండాల్లో అశాంతి, అల్లకల్లోల సమస్యలు తలెత్తుతున్నాయి. అవినీతి పెరుగుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుంటే సమాన్య ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ఇండియా విషయానికొస్తే... మన దేశంలో 63 మంది బిలియనీర్లు ఉన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ రూ.24,42,200 కోట్ల కంటే... ఆ 63 మంది సంపాదనే ఎక్కువని తేలింది. మన దేశంలో... ఓ టెక్నాలజీ కంపెనీ సీఈఓ సెకండ్‌కి రూ.106 సంపాదిస్తుంటే... ఆ వ్యక్తి 10 నిమిషాల్లో సంపాదిస్తున్నదానికంటే... మన దేశంలో ఓ కూలీ... ఏడాదిలో సంపాదించే దాని కంటే... ఎక్కువే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలంటోంది ఆక్స్‌ఫామ్ సంస్థ. ప్రభుత్వాలు ఏ కొద్ది మందికో అనుకూలంగా ఉండే నిర్ణయాలు కాకుండా... ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: January 20, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading