Home /News /international /

TOP QUOTES OF ZIMBABWE FORMER PRESIDENT ROBERT MUGABE

Robert Mugabe Died: రాబర్ట్ ముగాబే.. ఓ ఛమత్కార విస్ఫోటనం!

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే..

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే..

Robert Mugabe Died : రాబర్ట్ ముగాబే.. ఆయనో నల్ల సముద్రం.. యూరోపియన్ సామ్రాజ్యావాద వెర్రినవ్వుల్ని తుత్తునియలు చేసిన ఛమత్కారం.

  (మిట్టపెల్లి శ్రీనివాస్,న్యూస్18)

  వర్ణానికి వ్యక్తీకరణను ఆపాదించుకున్న సమాజాలు ప్రపంచమంతా ఉన్నాయి. అది యూరోపియన్ సామ్రాజ్యవాదం కక్కిన విషం కావచ్చు. ఆర్యులు ఇండియాకు మోసుకొచ్చిన సంస్కృతి కావచ్చు. నలుపంటే ఓ అల్పత్వమన్న భావన దాదాపుగా అన్ని సమాజాల్లోనూ స్థిరీకరించబడింది. ఇట్లాంటి భావనలను బద్దలు కొట్టడానికి తన ఛమత్కారాలతో యూరోపియన్ సామ్రాజ్యవాదాన్ని పరిహాసమాడినవాడు రాబర్ట్ ముగాబే(93). ఒక్క మాటలో చెప్పాలంటే.. ముగాబే ఓ ఛమత్కార విస్ఫోటనం. వర్ణ వివక్షపై మాత్రమే కాదు, స్త్రీ, సెక్స్ వంటి అంశాలపై ఆయన చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. అయితే వర్ణవివక్షపై ఆయన చేసిన వ్యాఖ్యల్లో ధిక్కారం కనిపిస్తే.. స్త్రీ, సెక్స్ వంటి అంశాల్లో మాత్రం పురుషహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జింబాబ్వే విముక్తి యోధుడిగా.. ఆ తర్వాతి కాలంలో నాలుగు దశాబ్దాలు ఆ దేశాన్ని పాలించిన ముగాబే.. ప్రపంచ దేశాధినేతలందరి కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి కూడా కావడం విశేషం. ముగాబేకి దాదాపుగా ఏడు డిగ్రీలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా శుక్రవారం సింగపూర్‌లో ముగాబే కన్నుమూసిన నేపథ్యంలో ఆయన పాపులర్ కోట్స్‌పై ఒక లుక్కేద్దాం..

  • వర్ణ వివక్షపై ముగాబే పాపులర్ కోట్:


  కార్లు తెలుపులో వాటి టైర్లు నలుపులో ఉన్నంత కాలం వర్ణ వివక్ష అంతం కాదు..
  నలుపును దురదృష్టానికి ప్రతీకగా, తెలుపును శాంతికి చిహ్నాంగా భావించినంత కాలం వర్ణ వివక్ష అంతం కాదు
  శుభకార్యాలకు తెలుపు దుస్తులు, అంత్యక్రియలకు నలుపు దుస్తులు ధరించినంత కాలం వర్ణ వివక్ష అంతం కాదు
  పన్నులు ఎగ్గొట్టేవారిని 'బ్లాక్' లిస్టులో పెట్టినంత కాలం వర్ణవివక్ష అంతం కాదు
  అయితే వీటిల్లో దేన్ని నేను లెక్క చేయను.. మల విసర్జన తర్వాత తెల్ల పేపర్ ఉపయోగించి శుభ్రం చేసుకున్నన్నాళ్లు నేను సంతృప్తిగానే ఉంటాను.

  • ఇప్పటి తరం యువతీ యువకులపై ముగాబే వేసిన సెటైర్:


  మనం ఎలాంటి సమాజంలో నివసిస్తున్నామంటే.. ప్రేమలో ఉన్న ఇప్పటి తరం యువతీ యువకులు తమ తమ ప్రైవేట్ అవయవాలను తాకడానికి ఒకరికొకరు అభ్యంతరం చెప్పుకోరు. కానీ ఒకరి ఫోన్‌ను ఇంకొకరు టచ్ చేస్తే మాత్రం అసలు ఊరుకోరు.

  • ఇప్పటితరం స్త్రీలపై ముగాబే సెటైర్:


  ఇప్పటితరం అమ్మాయిలు పట్టుమని ఐదు నిమిషాలు జాగింగ్ చేయడానికే బద్దకిస్తారు. కానీ తమ భాగస్వామి మాత్రం పడగ్గదిలో తమతో రెండు గంటలైనా శృంగారం చేయాలని కోరుకుంటారు.

  • అందంపై..:


  నువ్వు అందవిహీనంగా ఉన్నావంటే.. అందవిహీనంగా ఉన్నట్టే లెక్క. అంతే తప్ప అంత:సౌందర్యం గురించి మాట్లాడకు. ఎందుకంటే.. మనమేమి ఇక్కడ ఎక్స్‌రేలు పెట్టుకుని తిరగట్లేదు.

  •  ఈ కాలం ప్రేమ వ్యవహారాలపై:


  నువ్వు ఒకరి కంటే ఎక్కువమందితో ఒకేసారి ప్రేమలో ఉన్నావంటే.. నీకున్నది హృదయం కాదు.. అదొక మెమొరీ కార్డు.

  తన మాటలతో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ముగాబే.. పాలనలో మాత్రం సొంత ప్రజల నుంచే వ్యతిరేకతను ఎదుర్కోక తప్పలేదు. తన రెండో భార్య గ్రేస్‌ను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. చివరకు సైన్యం ఎదురుతిరిగి బలవంతంగా ఆయన్ను గద్దె దించక తప్పలేదు. ఓవైపు దేశం పేదరికంలో మగ్గిపోతుంటే..ముగాబే రెండో భార్య కేవలం తన షాపింగుల కోసం లక్షల డబ్బు ఖర్చు పెట్టడం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. దీంతో సైన్యం చర్యకు ప్రజలు సైతం మద్దతు పలికారు. అలా మొత్తానికి జింబాబ్వే చరిత్రలో ముగాబే ఏకఛత్రాధిపత్యానికి ఫుల్ స్టాప్ పడింది. ముగాబే పాలన ముగిశాక జింబాబ్వేలో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జాను-ఎఫ్ పార్టీకి చెందిన ఎమర్సన్ నంగాగ్వా 50.8శాతం ఓట్లను కైవసం చేసుకున్నాడు. అక్కడి అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పోలైన ఓట్లలో అభ్యర్థికి కనీసం 50శాతం ఓట్లు రావాలి. అలా నంగాగ్వా కొద్దిపాటి మెజారిటీతోనే ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.
  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Robert mugabe, Zimbabwe

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు