టాప్-5.. కనీవినీ ఎరుగని వివాహ సాంప్రదాయాలు..

ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని వివాహ సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని వినడానికే జుగుప్స కలిగించేవిగా ఉంటే.. మరికొన్ని చాలా ఆశ్చర్యపరిచేవి. అందులో కొన్నింటిని మీకోసం ఇక్కడ అందిస్తున్నాం..

news18-telugu
Updated: January 6, 2019, 6:12 PM IST
టాప్-5.. కనీవినీ ఎరుగని వివాహ సాంప్రదాయాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహం అనేది దేవుడు ప్రేమతో చేసిన ఒక ఏర్పాటు అని బైబిల్ చెబుతుంది. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు.. అంటే ధర్మం ప్రాతిపదికగా కామ, మోక్షాలను సాధించడానికి 'వివాహ' వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు హిందూ మతం చెబుతుంది. బ్రహ్మ చర్యాన్నీ, వైరాగ్యాన్నీ వ్యతిరేకించిన ఇస్లాం.. 'నికాహ్' దైవప్రవక్త సత్సంప్రాదాయంగా చెబుతుంది. ఇలా మతాల పరిధిలో వివాహం చుట్టూ ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు.. అంతకుమించిన సాంప్రదాయాలు అల్లుకుని ఉన్నాయి.కానీ మనకు తెలియని.. కనీసం మన ఊహకు కూడా అందని నమ్మకాలు, సాంప్రదాయాలు ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ చుట్టూ చాలానే ఉన్నాయి. అందులో అసాధారణంగా కనిపించే కొన్ని ఆచార సాంప్రదాయాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం..

weird marriage rituals, top weird marriages, different marriage customs, indian marriage system, విచిత్రమైన పెళ్లి సాంప్రదాయాలు, ఆశ్చర్యకర పెళ్లి సాంప్రదాయాలు, భారతీయ హిందూ సాంప్రదాయం, హిందూ పెళ్లి, దక్షిణ కొరియా, చైనా పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం..

ఆ రాత్రి నవ దంపతులతో మరో మహిళ..

ఆఫ్రికాలోని ఒక తెగ సాంప్రదాయ ప్రకారం.. పెళ్లైన మొదటిరోజు రాత్రి నవదంపతులకు తోడుగా మరో ఆడ మనిషిని కూడా వారి గదిలోకి పంపిస్తారు. ఆమె వధువు తల్లి లేదా బంధువుల్లో ఎవరైనా పెద్ద వయస్కురాలై ఉంటారు. ఆ రాత్రి నవదంపతులకు ఆమె సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

weird marriage rituals, top weird marriages, different marriage customs, indian marriage system, విచిత్రమైన పెళ్లి సాంప్రదాయాలు, ఆశ్చర్యకర పెళ్లి సాంప్రదాయాలు, భారతీయ హిందూ సాంప్రదాయం, హిందూ పెళ్లి, దక్షిణ కొరియా, చైనా పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం

కూతురిపై ఉమ్మి వేసే తండ్రి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల్లో ఆఫ్రికాకు చెందిన మాసాయి ట్రైబ్ ఒక అరుదైన తెగ. వీరి వివాహ పద్దతి కూడా వింతగానే ఉంటుంది. పెళ్లి జరిగేవేళ.. అమ్మాయి తండ్రి ఆమెపై ఉమ్మి వేయడం ఇక్కడివారి సాంప్రదాయం. భవిష్యత్తులో బిడ్డ జీవితం బాగుండాలని ఆశీర్వదిస్తూ తండ్రి చేసే చర్యగా దీన్ని భావిస్తారు.
weird marriage rituals, top weird marriages, different marriage customs, indian marriage system, విచిత్రమైన పెళ్లి సాంప్రదాయాలు, ఆశ్చర్యకర పెళ్లి సాంప్రదాయాలు, భారతీయ హిందూ సాంప్రదాయం, హిందూ పెళ్లి, దక్షిణ కొరియా, చైనా పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం

ఆ మూడు రోజులు నరకమే..

ఆసియాలోని అతిపెద్ద ద్వీపమైన బోర్నియోలోని ఒక జాతి పేరు తిదోంగ్. వీరి వివాహ సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి తర్వాత మూడు రోజుల వరకు వధూవరులను గది నుంచి బయటకు రానివ్వరు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ గది లోపల వాష్‌రూమ్ సౌకర్యం కూడా ఉండదు. కాబట్టి ఆ మూడు రోజులు కాలకృత్యాలు తీర్చుకోవడం సాధ్యపడదు. అలా మూడు రాత్రులు, మూడు పగళ్లు వారు నరకం అనుభవిస్తారనే చెప్పాలి.

weird marriage rituals, top weird marriages, different marriage customs, indian marriage system, విచిత్రమైన పెళ్లి సాంప్రదాయాలు, ఆశ్చర్యకర పెళ్లి సాంప్రదాయాలు, భారతీయ హిందూ సాంప్రదాయం, హిందూ పెళ్లి, దక్షిణ కొరియా, చైనా పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం

కోడిపిల్లను వధించి..

చైనా, మంగోలియాల్లోని దౌర్ తెగ సాంప్రదాయాలు కాస్త చిత్రంగానే ఉంటాయి. వీరి వివాహ సాంప్రదాయం ప్రకారం.. వధూవరులు కలిసి ఒక కోడిపిల్లను వధించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కత్తి పట్టుకుని కోడిపిల్లను వధించిన తర్వాత.. దాని లివర్‌ను బయటకు తీసి పరిశీలిస్తారు. ఒకవేళ ఆ లివర్ బాగుంది అనుకుంటే.. వెంటనే పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. లేదంటే.. కోడిపిల్లలను వధించడం.. వాటి లివర్స్ తీసి పరిశీలించడం కొనసాగుతూనే ఉంటుంది.

weird marriage rituals, top weird marriages, different marriage customs, indian marriage system, విచిత్రమైన పెళ్లి సాంప్రదాయాలు, ఆశ్చర్యకర పెళ్లి సాంప్రదాయాలు, భారతీయ హిందూ సాంప్రదాయం, హిందూ పెళ్లి, దక్షిణ కొరియా, చైనా పెళ్లి
ప్రతీకాత్మక చిత్రం..

చనిపోయిన చేపతో అరిపాదాలపై..

బర్త్ డే బాంబ్స్ పేరిట పుట్టినరోజు జరుపుకుంటున్న యువకులను స్నేహితులంతా కలిసి చితక్కొట్టడం మనకు తెలిసిందే. అలాగే దక్షిణ కొరియాలో ఓ సాంప్రదాయం ఉంది. ఇక్కడి వివాహ సాంప్రదాయం ప్రకారం.. వరుడిని ఫస్ట్ నైట్ గదిలోకి పంపించే ముందు ఓ తంతు జరుగుతుంది. అతని స్నేహితులంతా కలిసి 'చనిపోయిన చేప', 'వెదురు బొంగు'తో వరుడి అరిపాదాలపై కొడుతారు. వివాహ వేడుకలో ఇదో సరదా ఘట్టంగా వారు సెలబ్రేట్ చేసుకుంటారు.

First published: January 6, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading