TOP 10 : ప్రపంచంలో టాప్ 10 సురక్షిత నగరాలు ఇవే... ఇండియా పొజిషనేంటి?

Top 10 Safest Cities : ఈసారి టాప్ 10లో వాషింగ్టన్ డీసీ కొత్తగా చేరింది. వరుసగా మూడోసారి టోక్యో టాప్ 1 పొజిషన్‌లో నిలిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 10:49 AM IST
TOP 10 : ప్రపంచంలో టాప్ 10 సురక్షిత నగరాలు ఇవే... ఇండియా పొజిషనేంటి?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజంగా ఇది చిత్రమే. ఎప్పుడూ లేనిది... అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ... ఈసారి ప్రపంచ టాప్ 10 సేఫెస్ట్ నగరాల్లో చేరింది. ఐతే... ఈ లిస్ట్ నుంచీ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ టాప్ 9 నుంచీ జారిపడి... 20వ స్థానానికి వెళ్లిపోయింది. ప్రతీ సంవత్సరం లాగే... వరుసగా మూడోసారి జపాన్ రాజధాని టోక్యో మొదటిస్థానంలో నిలించింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్... ఈ ర్యాంక్స్ ఇచ్చింది. ఈ లిస్టులో సింగపూర్ కంటిన్యూగా రెండో పొజిషన్‌లో నిలవగా... జపాన్ ఓడరేవు నగరం ఒసాకా... మూడోస్థానంలో నిలిచింది. ఇక నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్... 4, ఆస్ట్రేలియాలోని సిడ్నీ 5, కెనడాలోని టొరంటో 6, అమెరికా రాజధాని వాషింగ్టన్ 7, డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ 8, దక్షిణ కొరియాలోని సియోల్ 9, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ 10వ స్థానాన్ని దక్కించుకున్నాయి.

ది ఎకనమిస్టి ఇంటెలిజెన్స్ యూనిట్‌లో మొత్తం ఐదు ఖండాల్లోని 60 నగరాలు ఉన్నాయి. డిజిటల్, ఆరోగ్యం, మౌలిక వసతులు, వ్యక్తిగత భద్రత వంటి అంశాల్ని లెక్కలోకి తీసుకొని... ర్యాంకులిచ్చారు. ఐతే... పారదర్శక పాలన, ప్రభుత్వం, ప్రజల ఆదాయం, వంటి అంశాలు కూడా సేఫ్టీని నిర్ధారిస్తాయి. రెండేళ్ల కిందట వాషింగ్టన్ 23వ స్థానంలో ఉండేది. అలాంటిది... అది ఇప్పుడు 7వ స్థానానికి చేరడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ లిస్టులో యూరప్ లోని ప్యారిస్, ఫ్రాంక్‍‌ఫర్డ్, జ్యురిచ్, స్టాక్‌హోమ్ వంటివి ఉన్నాయి. అమెరికా నుంచీ శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, డల్లాస్ కూడా స్థానం దక్కించుకున్నాయి.

దక్షిణ ఆసియాలో ఇండియా రాజధాని ఢిల్లీ 53వ స్థానం, మయన్మార్‌లోని యాంగోన్ 58వ స్థానం, పాకిస్థాన్‌లోని కరాచీ 57వ స్థానం, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా... 56వ స్థానం దక్కించుకున్నాయి.

First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>