Tokyo Olympics: రోబోలతో కరోనా టెస్టులు.. ఒలింపిక్స్‌కి అలా రెడీ అవుతున్న జపాన్

రోబోలతో కరోనా టెస్టులు (image courtesy - twitter - reuters)

Japan Robots: ఏం చెయ్యాలన్నా రోబోల సాయం తీసుకుంటోంది జపాన్ ప్రభుత్వం. కరోనా విషయంలోనూ ఇప్పుడు రోబోలు బిజీ అయిపోయాయి.

 • Share this:
  Tokyo Olympics 2021: కరోనా కారణంగా... గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడిన విషయం మనకు తెలుసు. దీనిపై జపాన్ చాలా అప్‌సెట్ అయ్యింది. మరో 200 రోజుల్లో ఈ క్రీడల్ని నిర్వహంచాలనుకుంటోంది. అంతకంటే ముందు... తమ దేశంలో కరోనా కంట్రోల్ అయ్యిందని జపాన్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కరోనాని కట్టడి చేసేందుకు తాము అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని ప్రూవ్ చేసేందుకు జపాన్ ఏకంగా రోబోలనే వాడేసుకుంటోంది. జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళవారం ఓ రకమైన రోబోలు ఏం చేస్తున్నాయో చూశారు. ఆ రోబోలు కరోనా PCR టెస్టులు స్వయంగా చేస్తున్నాయి. వాటికి ఎలక్ట్రానిక్ చేతులు ఉన్నాయి. ఆ చేతులతో అవి... పేషెంట్ల ముక్కు నుంచి స్వాబ్ తీసుకొని టెస్ట్ చేస్తున్నాయి. కరోనా ఉందో లేదో 80 నిమిషాల్లో చెబుతున్నాయి.

  "ఈ రోబోలను కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారుచేసింది. ఇవి షిప్పుల్లోని కంటైనర్లలో పట్టగలవు. అలాగే... ట్రక్కుల్లో వీటిని ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు. స్టేడియంలు, థీమ్ పార్కులు, ప్రజలు ఎక్కువగా గుమి కూడే దగ్గర వీటిని ఏర్పాటు చేయవచ్చు" అని కంపెనీ తెలిపింది.


  "ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి... మేము ఎక్కువ టెస్టులు జరపాల్సి ఉంటుంది. టెస్టులు ఎక్కువగా జరపాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి." అని జపాన్ ఆరోగ్యమంత్రి నిరోహిసా తామురా తెలిపారు.

  జపాన్‌లో ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఇలాంటి సమయంలో... డాక్టర్లకు శ్రమ తగ్గిస్తూ ఇలా రోబోలను రంగంలోకి దింపడం మంచి పనే అని తామురా అభిప్రాయపడ్డారు.


  ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉన్న రోబోలు... 16 గంటల్లో 2,000 టెస్టులు చేయగుతున్నాయి. వీటిని 40 అడుగుల ఎత్తున్న షిప్పింగ్ కంటైనర్లలో ఉంచారు. అందువల్ల వీటిని ఎక్కడికైనా తరలించవచ్చు అని చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్ రోజుకు 55,000 పీసీఆర్ టెస్టులు చేస్తోంది. నిజానికి లక్ష దాకా టెస్టులు చేసే కెపాసిటీ జపాన్‌కి ఉందని ప్రభుత్వ డేటా చెబుతోంది.

  ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ 5 రాశుల వారికి డబ్బు కొరత ఉండదు... వస్తూనే ఉంటుంది

  జపాన్‌లో ఇప్పటివరకూ 3,34,328 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం మరణాలు 4,548 ఉన్నాయి. నిన్న కొత్తగా 6,034 కేసులు రాగా... 47 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్‌కి ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (IOC) గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది సందేహం ఉంది. గతేడాది ఎలాగైనా నిర్వహిస్తామని పట్టుపట్టిన జపాన్... కరోనా కేసులు పెరగడంతో వాయిదా వేసుకోక తప్పలేదు.
  Published by:Krishna Kumar N
  First published: