హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Modi-Putin: నేడు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ప్రధాని మోదీతో భేటీ.. ఈ ఒప్పందాలపై సంతకాలు

Modi-Putin: నేడు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ప్రధాని మోదీతో భేటీ.. ఈ ఒప్పందాలపై సంతకాలు

మోదీ-పుతిన్ (పాత ఫొటో)

మోదీ-పుతిన్ (పాత ఫొటో)

Russian President Putin meet PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇవాళ భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌-రష్యా మధ్య 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వ సమావేశం. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ భేటీలో కీలక ఒప్పందాలపై ఇద్దరు నేతలకు సంతకాలు చేయనున్నారు..

ఇంకా చదవండి ...

  Russian President Putin meet PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  (Russian President Putin) ఇవాళ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi:)తో ఆయన భేటీ అవుతారు. ఈ భేటీలో రష్యా-భారత్‌  (Russia - India)మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడేందుకు ఈ భేటీ దోహదం చేస్తుంది. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా భేటీ జరుగనుంది. మోదీ-పుతిన్‌లు ఇవాళ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా రేపు ముఖాముఖిగా సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సదస్సుతో పాటు ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు.

  భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ S-400ను మరింత వేగంగా అందించాలని భారత్ .. రష్యాను కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింత పెంచుకోనున్నారు. ఇందులో భాగంగానే అమేఠీ సమీపంలోని కోర్వాలో 5 వేల కోట్ల రూపాయలతో సంయుక్తంగా నెలకొల్పిన ఫ్యాక్టరీలో 5లక్షల ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సైన్యం కోసం రెండు ఇంజిన్ల 226T హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా నిర్ణయించనున్నారు. కానీ రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన విధానం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ద్వారా ఉంటుందని ఆమెరికాకు ఇండియా స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా-భారత్ మధ్య సంబంధాల్లో బంధం బలపడాలంటే పుతిన్ రాక ఎంతో కీలకం కానుంది.

  ఇదీ చదవండి : నేటి రాశి ఫలాలు.. శుభవార్తలు వింటారు.. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది

  మోదీతో భేటీ తర్వాత మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుతిన్‌ రష్యాకు తిరుగు పయనమవుతారు. ఇక పుతిన్‌ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు. భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది భారత్‌లో జరగాల్సిన ఈ సదస్సు.. కరోనా కారణంగా వాయిదా పడింది.

  ఇదీ చదవండి : నిన్న అబ్బాయితో.. నేడు బాబాయ్ తో.. నందమూరి హీరోలతో మహేష్ సందడి.. ఫోటోలు వైరల్

  రష్యా అధ్యక్షుడి షెడ్యూల్‌ ఇలా..

  10:30AM: ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు.

  10.30AM: ఇద్దరు రక్షణ మంత్రుల మధ్య సమావేశం మరియు చర్చలు

  11.30AM: భారతదేశం-రష్యా మధ్య మొదటి 2+2 సంభాషణ, దీనిలో ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రుల ప్రతినిధి బృందం చర్చలు.

  3-4 PM: వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం ఢిల్లీ చేరుకుంటుంది.

  సాయంత్రం 5: హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-పుతిన్‌ భేటీ

  5:30 PM: మోడీ-పుతిన్ చర్చలు ప్రారంభం

  7.30PM: డిన్నర్

  8-9PM ఉమ్మడి ప్రకటన విడుదల

  9.30PM – పుతిన్ రష్యాకు బయలుదేరుతారు

  అయితే దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు పుతిన్ అక్కడే ఉంటారు. ప్రారంభ వ్యాఖ్యలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కెమెరాలో ఉమ్మడి మీడియా ప్రకటన ఉండదు. కెమెరామెన్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: India, India news, Narendra modi, Russia, Vladimir Putin

  ఉత్తమ కథలు