తల్లడిల్లుతున్న టైటానిక్ హీరో...

లియోనార్డో డీ కాప్రియో

కేరళ వరదల సమయంలో, చెన్నై నీటి కరువు సమయంలో కూడా డికాప్రియో ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఢిల్లీ పొల్యూషన్‌పై స్పందించాడు.

  • Share this:
    లియోనార్డో డికాప్రియో అంటే హాలీవుడ్ హీరోనే కాదు. పర్యావరణ ఉద్యమకారుడు కూడా. తను ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనకపోయినా. ప్రకృతి సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు స్పందిస్తుంటాడు. ముఖ్యంగా భారత్‌లో పరిస్థితులను చూసి ఈ హాలీవుడ్ హీరో తల్లడిల్లుతున్నాడు. డికాప్రియో తాజాగా ఢిల్లీలో గాలి నాణ్యత మీద స్పందించాడు. ‘ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ 1500 మంది సామాజిక ఉద్యమకారులు ఇండియా గేట్ వద్ద ప్రదర్శన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వాయుకాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15లక్షల మంది చనిపోతున్నారు. వాయుకాలుష్యం అనేది భారత్‌లో ఐదో అతిపెద్ద హంతకురాలు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డికాప్రియో పోస్ట్ చేశాడు.

    ఇప్పుడే కాదు. గతంలో కూడా పలుమార్లు భారత్‌లో పరిస్థితులను చూసి ఈ టైటానిక్ హీరో ఆందోళన వ్యక్తం చేశాడు. కేరళ వరదలు వచ్చినప్పుడు, చెన్నైలో నీటి కొరత వెంటాడినప్పుడు కూడా తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అలాగే, ఈషా ఫౌండేషన్ నిర్వహించిన కావేరి కాలింగ్ క్యాంపెయినింగ్‌కు మద్దతు పలికాడు. భారత్ అంటే ఈ హాలీవుడ్ హీరోకి ప్రత్యేకమైన అభిమానం. ఓసారి కేరళ గురించి ప్రస్తావిస్తూ..‘భూమి మీద స్వర్గం ఏదైనా ఉంటే అది ఇదే.’ అని చెప్పాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: