హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

300 కోట్ల ఏళ్ల నాటి గోళాలు... గ్రహాంతర వాసులు తయారుచేశారా?

300 కోట్ల ఏళ్ల నాటి గోళాలు... గ్రహాంతర వాసులు తయారుచేశారా?

ఒట్టోస్డల్ గోళం (Image : Wikipedia)

ఒట్టోస్డల్ గోళం (Image : Wikipedia)

Klerksdorp Spheres : ఏదైనా ఊహిచుకోవడం తేలికే. నిరూపించడమే కష్టం. దక్షిణ ఆఫ్రికాలోని ఆ గోళాలు కూడా ఎన్నో ఊహలకు కేంద్రమయ్యాయి. సైన్స్ లేవనెత్తే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు. ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం.

ఫొటోలోని గోళాన్ని చూశారు కదా... కార్క్ బాల్ లాగా ఉంది కదూ. దాన్ని చూస్తే... ప్రకృత్రిలో సహజ సిద్ధంగా తయారైన దానిలా అనిపిస్తోందా? లేదు కదా. ఎవరో కావాలనే ఓ రాయిని గుండ్రంగా చెక్కి... మధ్యలో చుట్టూ మూడు గీతలు పెట్టినట్లు అనిపిస్తోంది కదా. మనలాగే శాస్త్రవేత్తలకు అనిపించింది. 4 సెంటీమీటర్లు ఉన్న ఈ గోళం... దక్షిణాఫ్రికాలోని క్లెర్క్స్‌డార్ప్‌లో ఉన్న ఒట్టోస్డల్ గనుల్లో దొరికింది. దీన్ని చూసిన కార్మికులు... గని యజమానులకు ఇచ్చారు. వాళ్లు దాన్ని ప్రభుత్వానికి చేరవేశారు. ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులకు ఇచ్చింది. వాళ్లు ఆ రాయి ఎప్పటిదో తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించారు. షాకయ్యారు. ఎందుకంటే అది 300 కోట్ల సంవత్సరాల కిందటిది అని తేలింది.

ఒట్టోస్డల్‌లో తవ్వకాలు జరపగా... మరిన్ని రాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ కార్బొనేట్‌తో సహజసిద్ధంగా తయారయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో చాలా వరకూ అర సెంటీమీటర్ నుంచీ 10 సెంటీమీటర్లు ఉన్నాయి. మరైతే వాటి చుట్టూ ఆ గీతలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నిస్తే... సెడిమెంట్ (సున్నపురాయి) గనుల్లో పుట్టే ఖనిజాలు, రాళ్లకు ఇలాంటి రూపురేఖలు సహజ సిద్ధంగానే వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సమాధానం ప్రపంచ దేశాల ప్రజలకు నచ్చలేదు. నమ్మశక్యంగా లేకపోవడమే కారణం.

రెండు డౌట్లు : రాళ్లు గుండ్రంగా ఉండటం, వాటిపై గీతలు చుట్టూ ఓ పద్ధతి ప్రకారం ఉండటం. సహజ సిద్ధంగా ఏర్పడే రాళ్లు ఇలా ఎలా ఏర్పడతాయి? ప్రజల్లో ఈ అనుమానాల్ని మరింత పెంచుతూ... యూఫాలజిస్టులు (UFOలు ఉన్నాయని చెప్పేవారు) రంగంలోకి దిగారు. మానవుల కంటే ముందు ఈ భూమిపై గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఈ రాళ్లే నిదర్శనం అని చెప్పుకొచ్చారు.

ఈ వివాదం కొనసాగుతుండగా ఓ వ్యక్తి పై ఫొటోలోని రాయిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా దగ్గరకు తీసుకెళ్లాడు. వాళ్లు దాన్ని పరిశీలించి అది జీరో గ్రావిటీలో తయారైన రాయి అనీ, అది చుట్టూ సమానమైన బరువుతో ఉందని తేల్చినట్లు తెలిసింది. నాసా ఇలా చెప్పినట్లుగా ఆధారాలు లేవు. ఈ రాయి ఇనుము కంటే గట్టిగా ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు.

ఈ రాళ్లను మతపరమైన ప్రయోజనాల కోసం గానీ లేదంటే సైనిక అవసరాల కోసం గానీ తయారుచేసి ఉండొచ్చని యూఫాలజిస్టులు అంచనాకి వచ్చారు. 300 కోట్ల ఏళ్ల కిందటే భూమిపై అద్భుతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకలో ఉంది అనేందుకు ఈ రాళ్లే నిదర్శనం అన్నారు కొందరు.

ఇవన్నీ కొట్టిపారేసిన సైంటిస్టులు... ఈ రాళ్లు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయనే వాదనను బలపరుస్తూ... ఇది ప్రకృతిలో జరిగిన అద్భుతం అని తేల్చేశారు. ఇలా ఈ రాళ్లు ఓ మిస్టరీగా మిగిలిపోయాయి.

First published:

Tags: VIRAL NEWS, World

ఉత్తమ కథలు