news18
Updated: November 14, 2020, 3:10 PM IST
డొనాల్డ్ ట్రంప్.. (ఫైల్)
- News18
- Last Updated:
November 14, 2020, 3:10 PM IST
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు నాదే... ఎవరెన్ని చెప్పినా విజయం నాదే.. అమెరికా మళ్లీ నా వెంటే.. బిడెన్ ను ఎవరూ నమ్మరు, ఆయన చైనాకు తొత్తు.. అధ్యక్ష ఎన్నికల్లో నేనే గెలిచాను.. బిడెన్ మోసం చేశాడు. నేను కోర్టుకెళ్తా.. యూఎస్ పీఠంపై నన్ను దింపేడయం అసాధ్యం.. నైతికంగా నేనే గెలిచాను.. అధ్యక్ష పీఠం వదిలే ప్రసక్తే లేదు.....’ ఇవీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. జరుగుతున్న క్రమంలో పలు సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. కానీ ఆయన ఉన్నట్టుండి వేదాంత ధోరణికి మళ్లారు. యూఎస్ అధ్యక్షుడెవరని అడిగిన ప్రశ్నకు అందరూ ముక్కున వేలేసుకునే సమాధానం చెప్పారు ట్రంప్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...?
అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పారు. శుక్రవారం అమెరికాలోని రోజ్ గార్డెన్ లో ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ప్రకటన నిమిత్తం ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు అధ్యక్షపదవిపై ఆయనను ప్రశ్నలడిగారు. ఇందుకు ట్రంప్ సమాధానమిస్తూ... ‘తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది నా చేతుల్లో లేదు.. దానిని కాలమే నిర్ణయిస్తుంది..’ అని చెప్పడం గమనార్హం. తాను ఓడిపోలేదని ఆయన మరోసారి తన పంతాను కొనసాగించారు.
ఇక కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై మాట్లాడుతూ...కరోనా వ్యాప్తికి అమెరికాలో మరోమారు లాక్డౌన్ విధించే అవసరమేమీ లేదని అన్నారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ వల్ల రోజుకు 50 బిలియన్ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉన్నదని.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వానికి మరోసారి లాక్డౌన్ విధించే అవసరం లేదన్నారు.
ఇటీవలే వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో బిడెన్ చేతిలో ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. బిడెన్ కు 306 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే.. ట్రంప్ కు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బిడెన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కానీ ట్రంప్ మాత్రం బిడెన్ విజయాన్ని అంగీకరించడం లేదు. వచ్చే ఏడాది జనవరి 20న బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
Published by:
Srinivas Munigala
First published:
November 14, 2020, 3:10 PM IST