టిక్ టాక్‌పై అమెరికాలో విచారణ...సహకరిస్తామంటున్న యాజమాన్యం

అమెరికా ప్రభుత్వం చేపట్టే విచారణపై పట్ల టిక్‌టాక్‌ స్పందించింది. ప్రభుత్వం చేసే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ తెలిపింది.

news18-telugu
Updated: November 3, 2019, 9:47 PM IST
టిక్ టాక్‌పై అమెరికాలో విచారణ...సహకరిస్తామంటున్న యాజమాన్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన టిక్‌టాక్‌ యాప్‌పై అమెరికా విచారణ ప్రారంభించనుంది. చైనాకు చెందిన ఈ యాప్ పై ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు బ్యాన్ విధించారు. దీంతో అమెరికా సైతం జాతీయ భద్రతా ప్రమాణాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా టిక్ టాక్ యాప్‌ ద్వారా రాజకీయ సంబంధ సున్నిత సమాచారం ఏదైనా పక్కదారి పడుతుందేమోనన్న కారణంగా ఈ విచారణ జరగనుంది. దీంతో పాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను యాజమాన్యం స్టోర్‌ చేసే విధానాలపైనా దృష్టి పెట్టనుంది. అయితే అమెరికా ప్రభుత్వం చేపట్టే విచారణపై పట్ల టిక్‌టాక్‌ స్పందించింది. ప్రభుత్వం చేసే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ తెలిపింది.

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు