అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు టిక్ టాక్‌లో కీలక వికెట్ పడింది. కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్‌పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా ట్రంప్ టార్గెట్ చేయడంతో.. రాజీనామా ప్రకటించారు. టిక్ టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఉద్యోగులందరినీ విడిచి వెళ్లడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఇక కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్లు టిక్ టాక్ తెలిపింది.
కాగా, కెవిన్ మాయర్ గతంలో డిస్నీ సంస్థలో పనిచేశారు. 4 నాలుగు నెలల క్రితమే టిక్ టాక్ ఆయన్ను సీఈవోగా నియమించింది. మాయర్ రాకతో అమెరికాలో టిక్ టాక్ దూసుకెళ్తుందని భావించింది. అమెరికా రెగ్యులేటరీలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేసి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళతారని అంచనావేసింది. కానీ పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించడం.. ఆ తర్వాత అమెరికాలోనూ బ్యాన్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇబ్బందులో పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.