TikTok Ban: టిక్‌టాక్‌ను నాలుగోసారి బ్యాన్ చేసిన పాకిస్తాన్.. ఆ వీడియోలే కారణం..

TikTok (ప్రతీకాత్మకచిత్రం)

చైనాకు చెందిన పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై దాయాది దేశం పాకిస్తాన్ నాలుగో సారి నిషేధం విధించింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ పదేపదే టిక్‌టాక్‌లో కనిస్తున్నా ఆ కంటెంట్‌ను నియంత్రించడంలో.. అలాంటి కంటెంట్‌ను తొలగించడంలో టిక్‌టాక్ విఫలమైందని.. అందుకే నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది.

  • Share this:
    ఇస్లామాబాద్: చైనాకు చెందిన పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై దాయాది దేశం పాకిస్తాన్ నాలుగో సారి నిషేధం విధించింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ పదేపదే టిక్‌టాక్‌లో కనిస్తున్నా ఆ కంటెంట్‌ను నియంత్రించడంలో.. అలాంటి కంటెంట్‌ను తొలగించడంలో టిక్‌టాక్ విఫలమైందని.. అందుకే నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. గతంలో కూడా టిక్‌టాక్‌ను పాకిస్తాన్ మూడుసార్లు తాత్కాలికంగా నిషేధించింది. నిషేధం విధించిన ప్రతిసారి.. ఇకపై అలాంటి కంటెంట్‌ను నియంత్రిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం చెప్పడంతో పాకిస్తాన్ ఆ నిషేధాన్ని తొలగించింది. అయినప్పటికీ అభ్యంతకర వీడియోలు టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తుండటంతో మరోసారి పాకిస్తాన్ టిక్‌టాక్‌పై వేటు వేసింది. అశ్లీల వీడియోలను అందుబాటులో ఉంచిన కారణంగా 2020, అక్టోబర్‌లో టిక్‌టాక్‌ను తొలిసారి పాక్ నిషేధించింది. అయితే.. అలాంటి కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకుంటామని టిక్‌టాక్ హామీ ఇవ్వడంతో పది రోజులకే ఆ నిషేధాన్ని పాక్ తొలగించింది. మళ్లీ.. పెషావర్ కోర్టు టిక్‌టాక్‌పై మార్చిలో నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత ఆ బ్యాన్‌ను ఏప్రిల్‌లో ఎత్తేసింది. పాకిస్తాన్‌లో టిక్‌టాక్ చాలా పాపులర్ యాప్.

    భారత్‌లో నిషేధం విధించిన ఈ టిక్‌టాక్‌కు పాకిస్తాన్‌లో 30 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయంటే అక్కడ టిక్‌టాక్‌ను ఏ రేంజ్‌లో వినియోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభ్యంతరకర వీడియోలు, అశ్లీల వీడియోలు టిక్‌టాక్‌లో హల్‌చల్ చేయడం కొత్తేమీ కాదు. జనవరి నుంచి మార్చి మధ్యలో టిక్‌టాక్ 6,495,992 వీడియోలను తొలగించిందటే అలాంటి కంటెంట్‌కు టిక్‌టాక్ ఎలా వేదికగా మారిందో తెలుస్తూనే ఉంది. కేవలం అశ్లీల వీడియోలు మాత్రమే కాదు హింసను ప్రేరేపించే వీడియోలు కూడా టిక్‌టాక్‌లో చాలానే ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ఇప్పటికే నిషేధాన్ని ఎదుర్కొంటున్న టిక్‌టాక్ పేరు మార్చుకుని మళ్లీ మన దేశంలోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది.

    అయితే.. గతంలో ‘TikTok’ గా ఉన్న ఈ వీడియో యాప్ పేరు భారత్‌లో ‘TickTock’ గా మారబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కొత్త పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే భారత్‌లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న పబ్జీ గేమ్.. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చుకుని భారత్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా డెవలపర్ సంస్థ క్రాఫ్టన్ ఈ పేరు మార్చుకున్న పబ్జీని డెవలప్ చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: