Home /News /international /

TIK TOK BAN TRUMP SAYS US LOOKING INTO BANNING TIKTOK SK

TikTok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్‌పై ట్రంప్ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా పౌరుల సమాచారాన్ని కూడా టిక్ టాక్, ఇతర యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు. చైనా యాప్స్‌ని అస్సలు నమ్మలేమని.. ఆ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శించారు.

ఇంకా చదవండి ...
    చైనాకు బిగ్ షాక్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియా టిక్ టాక్‌ సహా పలు యాప్స్‌పై నిషేధం విధించారు. తాజాగా అమెరికాలోనూ టిక్ టాక్‌పై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్‌‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనీస్ యాప్ టిక్ టాక్‌పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కాగా, భారత్‌లో టిక్ టాక్‌పై నిషేధం విధించాడని ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోపియో పాంపియోతో పాటు అమెరికా కాంగ్రెస్ సభ్యులు సమర్థించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్‌ను బ్యాన్ చేస్తూ భారత్ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అభినందించారు.

    అమెరికా పౌరుల సమాచారాన్ని కూడా టిక్ టాక్, ఇతర యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయని కాంగ్రెస్ ప్రతినిధులు ఆరోపించారు. చైనా యాప్స్‌ని అస్సలు నమ్మలేమని.. ఆ యాప్స్ ద్వారా అమెరికాలో చైనా కమ్యూనిస్టు పార్టీ గూఢచర్యం చేస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అమెరికాలో టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ 25 మంది కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు లేఖ రాశారు. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడం ద్వారా చైనా కమ్యూనిస్ట్ పార్టీ గూఢచర్యాన్ని అడ్డుకోవాలని తమ లేఖలో వారు కోరారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది.

    కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను జూన్‌లో భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే బాటలో వెళ్లాలని అమెరికా సైతం భావిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: America, Donald trump, Tik tok, Tiktok

    తదుపరి వార్తలు