#HowdyModi live: భారత్, అమెరికా మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైంది : ట్రంప్

గత దశాబ్ద కాలంలో సుమారు 30 కోట్ల మంది భారతీయులు దారిద్ర్యం నుంచి బయటపడ్డారని, ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. అలాగే అమరికాలో పెట్టుబడులు పెట్టేందుకు పలు భారతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయిని, ఇప్పటికే జెఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ అమెరికాలో పెట్టుబడులు పెట్టిందని ట్రంప్ అన్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 9:06 AM IST
#HowdyModi live: భారత్, అమెరికా మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైంది : ట్రంప్
Video : వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చు... మోదీతో ట్రంప్
  • Share this:
ప్రధాని మోదీ భారత్ లో చక్కటి పాలన అందిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హౌడీ మోదీ సభలో ప్రసంగించడం తనకు గౌరవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం సాధించడం పై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు..ఇరు దేశాల మధ్య మైత్రి బంధం మరింత దృఢపడాలని ట్రంప్ ఆశించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 30 కోట్ల మంది భారతీయులు దారిద్ర్యం నుంచి బయటపడ్డారని, ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. అలాగే అమరికాలో పెట్టుబడులు పెట్టేందుకు పలు భారతీయ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయిని, ఇప్పటికే జెఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ అమెరికాలో పెట్టుబడులు పెట్టిందని ట్రంప్ అన్నారు. అలాగే రానున్న కాలంలో ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భారత్‌కు అమెరికన్ క్రూడాయిల్ ఎగుమతులు గత సంవత్సర కాలంలో ఏకంగా 400 శాతం పెరిగాయని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. తద్వారా ఇరుదేశాల మధ్య ఎనర్జీ రంగంలో ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ట్రంప్ ఉటంకించారు. అతిత్వరలో ముంబైలో వరల్డ్ క్లాస్ ఎన్బీఏ గేమ్ జరగనుందని చాలా సంతోషమని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే హ్యూస్టన్ వేదికగా హౌడీ మోదీ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఇరు దేశాల అధిపతులు ఒకే వేదికను పంచుకున్నారు. సుమారు 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు ఈ ఈవెంట్‌కు తరలిరావడం విశేషం.First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>