Throuple: భర్త ఫ్రెండ్‌ను ఇష్టపడిన భార్య.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భర్త.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన భర్త ఫ్రెండ్‌ను ఇష్టపడింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా.. అతడు కూడా భార్య కోరికను అంగీకరించాడు.

  • Share this:
    ఓ మహిళ తన భర్త ఫ్రెండ్‌ను ఇష్టపడింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా.. అతడు కూడా భార్య కోరికను అంగీకరించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ ఇష్టపడింది భర్త యొక్క మహిళా స్నేహితురాలిని. ఎందుకంటే.. ఆమె ద్విలింగ సంపర్కురాలు(అంటే పురుషులు, మహిళలపై లైంగిక ఆకర్షణ కలిగి ఉండేవారు). వివరాలు.. అమెరికాలోని సియోటల్‌కు చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న ఏళ్ల క్లైర్ థోర్న్‌హిల్, కమెడియన్ జస్టిస్ రూపెల్ ఇద్దరు కాలేజ్‌లో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారు.అయితే జస్టిన్‌కు 2006లో కేటీ రూపెల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా సంవత్సరాలు డేటింగ్ చేశారు. కేటీ, జస్టిన్ 2013 లో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత, భార్యాభర్తలలో రహస్యం ఏదీ ఉండకూడదనే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా కేటీ చెప్పిన విషయం విని జస్టిన్ షాక్ అయ్యాడు.

    కేటీ తనకు స్వలింగసంపర్క సంబంధాలపై ఎక్కువ ఆసక్తి ఉందని తెలిపింది. జస్టిన్ ఫ్రెండ్ క్లైర్‌ పట్ల తనకు లైంగిక ఆకర్షణ ఉందని పేర్కొంది. సోషల్ మీడియా ఖాతాలో క్లైర్‌ను చూసినట్టు తెలిపింది. ఆమె అందం పట్ల ఆకర్షితురాలైనట్టు వెల్లడించింది. కేటీ ఇలా చెప్పిన తర్వాత.. కొంతకాలం ఈ విషయంపై చర్చ జరిగింది. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి.. ఈ విషయాన్ని క్లైర్‌కు చెప్పారు.



    కేటీ, జస్టిన్ చెప్పిన మాటలు విన్నప్పుడు తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని క్షైర్ చెప్పింది. ఎందుకంటే గతంలో తనకు ఎప్పుడు ఇలాంటి ప్రపొజల్ రాలేదని తెలిపింది. అయితే తనకు కూడా పురుషులు, మహిళలు ఇద్దరి పట్ల లైంగిక ఆకర్షణ ఉండటంతో.. ఇందుకు ఒకే చెప్పానని పేర్కొంది. దీంతో ఈ ముగ్గురు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏ విషయానైనా ముగ్గురి కలిసి చర్చించుకుంటారు. వీరికి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. అయితే వీరి బంధాన్ని చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే క్లైర్ మాత్రం.. ‘మనుషులుగా.. ఒకేసారి చాలా మందిని ప్రేమించగలగడం, ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి అవకాశం లభించడం అదృష్టం’తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: