Viral : ఆ పాముకి మూడు కన్నులు..

రెండు తలలు కలిసినందువల్ల ఇలా జరిగిందా అన్న సందేహంతో ఎక్స్‌రేలు కూడా తీశామని.. కానీ ఆ కన్ను సహజ సిద్దంగానే ఏర్పడిందని అధికారులు అన్నారు.

news18-telugu
Updated: May 2, 2019, 6:38 PM IST
Viral : ఆ పాముకి మూడు కన్నులు..
మూడు కన్నుల పాము(Image : Facebook)
news18-telugu
Updated: May 2, 2019, 6:38 PM IST
ఆస్ట్రేలియాలోని డార్విన్ సమీపంలో ఓ రహదారిపై వన్యప్రాణి సంరక్షక అధికారులు మూడు కన్నుల పామును గుర్తించారు. పాము ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో.. క్షణాల్లో అది వైరల్‌గా మారింది. మార్చి నెలలో ఆ పామును గుర్తించినప్పుడు దాని వయసు 3నెలలు అని, 40సెం.మీ పొడవు ఉందని అధికారులు తెలిపారు. అయితే దాన్ని గుర్తించిన కొద్ది వారాలకే అది మృతి చెందిందని చెప్పారు.

పాము పిండ దశలో ఉన్నప్పుడే దాని నుదుటి భాగంలో మూడో కన్ను కూడా ఏర్పడిందని అధికారులు తెలిపారు. అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని చెప్పారు. రెండు తలలు కలిసినందువల్ల ఇలా జరిగిందా అన్న సందేహంతో ఎక్స్‌రేలు కూడా తీశామని.. కానీ ఆ కన్ను సహజ సిద్దంగానే ఏర్పడిందని అన్నారు. దాన్ని 'మాంటీ పైతాన్' పేరుతో పిలుచుకుంటున్నట్టు తెలిపారు. పాములు ఇలా అరుదైన ఆకృతితో కనిపించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని చెబుతున్నారు.



First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...