హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

EU Leaders Ukrine Visit : యుద్ధం వేళ..ఉక్రెయిన్ కి మూడు దేశాల ప్రధానులు

EU Leaders Ukrine Visit : యుద్ధం వేళ..ఉక్రెయిన్ కి మూడు దేశాల ప్రధానులు

ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడులు(ప్రతీకాత్మక చిత్రం)

ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడులు(ప్రతీకాత్మక చిత్రం)

EU Leaders Ukraine Visit : యుద్ధం ప్రారంభించి మూడు వారాలవుతున్నా ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యాకి పట్టు చిక్కడం లేదు. రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ముప్పుతిప్పలు పెడుతోంది.

ఇంకా చదవండి ...

EU Leaders Ukrine Visit Amidst Russia-Ukraine War : ఉక్రెయిన్​ లోని ప్రధాన నగరాలపై 20 రోజులుగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తొలుత సైనిక స్థావరాలు, ఆర్మీనే టార్గెట్ అని చెప్పిన రష్యా.. క్రమంగా ఆఫీసులు, అపార్ట్ ​మెంట్ బిల్డింగ్ లను ను సైతం టార్గెట్ చేస్తోంది. రెండు రోజులుగా మరియుపోల్​ సిటీలో వందకుపైగా ఏరియల్​ బాంబులను రష్యా ప్రయోగించిందని, ఈ దాడుల్లో సుమారు వందలాదిమంది చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా జరిపిన ఒక ఏరియల్​స్ట్రయిక్ కెమెరాలో రికార్డ్​ అయ్యింది. అపార్ట్​మెంట్ బిల్డింగ్​ లే టార్గె ట్​గా ఈ దాడులు జరిగినట్టు ఆ వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయితే యుద్ధం ప్రారంభించి మూడు వారాలవుతున్నా ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యాకి పట్టు చిక్కడం లేదు. రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ముప్పుతిప్పలు పెడుతోంది.

అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కు చెందిన కీలక నేతలు మంగళవారం రైలులో ఉక్రెయిన్​ కు బయల్దేరారు. పోలండ్ ప్రధానమంత్రి మేటియస్ మోరెవియకి, ఉప ప్రధాని యరస్లో కాచిన్​స్కీ, చెక్ రిపబ్లిక్ ప్రధాని పెటర్ ఫీలా, స్లొవేనియా ప్రధాని యానెస్ జేన్సా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్​ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ కు మద్దతు తెలిపేందుకే వీరు ఈ పర్యటన చేపడతున్నట్లు అర్థమవుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో యూడు దేశాల ప్రధానుల ఉక్రెయిన్​ పర్యటన చర్చనీయాశంగా మారింది. యూరోపియన్ యూనియన్ సమన్వయంతోనే ఈ పర్యటన చేపట్టినట్లు పోలండ్ ప్రధానమంత్రి తెలిపారు. ఐక్యరాజ్య సమితికి కూడా పర్యటన గురించి సమాచారం అందించినట్లు చెప్పారు. పర్యటన కొద్దిరోజుల ముందే ఖరారైందని, భద్రతా కారణాల వల్ల రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని మోరెవియకి కార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్ ​కు అందించనున్న సహాయం గురించి జెలెన్​స్కీతో నేతలు చర్చిస్తారని వివరించారు.

ALSO READ Russia : బైడెన్ కు పుతిన్ రివర్స్ ఝలక్..అమెరికాపై ఆంక్షలు విధించిన రష్యా

మరోవైపు, కీవ్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర మేయర్ విటాలి క్లిష్కో ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. మార్చి 17 ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. బాంబు షెల్టర్లలోకి వెళ్లేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని మేయర్ స్పష్టం చేశారు.

ఇక, ఉక్రెయిన్ సేనలతో పాటు సామాన్య పౌరులు కూడా తిరగబడుతుండటంతో చేసేది లేక ఆస్పత్రులపై సైతం దాడులకు దిగుతున్న రష్యాకు మరో షాకింగ్ వార్త అందుతోంది. రష్యా వద్ద మరో పది రోజులు మాత్రమే యుద్ధం చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రి, సైనికులు ఉన్నట్లు తాజాగా ఓ రిపోర్ట్ వెలువడింది. యూఎస్ కు చెందిన ఓ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంచనా ప్రకారం రష్యాకు మరో పది రోజుల పాటు ఉక్రెయిన్ లో యుద్ధం చేసే సామర్ధ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు మించి యుద్ధం జరిగితే రష్యాకు కష్టనష్టాలు తప్పేలా లేవు. యూఎస్ ఆర్మీలో గతంలో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ హడ్జెస్ తాజాగా బయటపెట్టిన ఈ వివరాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. రష్యన్ ఆర్టీ, రాకెట్లు, క్రూయిజ్ క్షిపణులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని ఫ్టినెంట్ జనరల్ హడ్జెస్ కోరారు.

First published:

Tags: Russia-Ukraine War, Ukraine, Zelensky

ఉత్తమ కథలు