Home /News /international /

THOUSANDS PROTEST AT LANKA PRESIDENTS HOME SPECIAL TASK FORCE CALLED IN PAH

లంక అధ్యక్షుడి ఇంటి ముందు ఆందోళన కారుల బీభత్సం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు పిలుపు..

దాడులు చేస్తున్న నిరసన కారులు

దాడులు చేస్తున్న నిరసన కారులు

Lanka Presidents Home: శ్రీలంక ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తుంది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు.. తినడానికి ఆహార పదార్థాలు దొరక్క అల్లాడి పోతున్నారు. ఇటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు కొలంబోలోని గోటబయా రాజపక్సే ఇంటి సమీపంలో బీభత్సాన్నిసృష్టించారు.

ఇంకా చదవండి ...
Thousands Protest At Gotabaya Rajapaksa home: లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాల వలన దేశం తీవ్ర సంక్షోభంలో పడింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక.. పెట్రోల్, డీజీల్ లేక రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడం వలన రోజుకు దాదాపు.. 13 గంటల పాటు కరెంట్ కోతను విధిస్తున్నారు.

ఆహారం, ఇంధనం, గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో తమ ఈ రోజుల లంక ప్రజలు కొలంబో చేరుకున్నారు. అధ్యక్షుడి భవనం ముందు దాదాపు.. 2000 మంది నిరసన వ్యక్తం చేశారు. ఇటు ఆస్పత్రులలో ఆపరేషన్ లు నిలిచిపోయాయి. రవాణాలేకపోవడం వలన మందుల కొరత నెలకొంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులు నిలిచిపోయాయి. ఇక వీధి దీపాలను ఆర్పివేస్తున్నారు. దీంతో శ్రీ లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎక్కడ చూసిన అంధకారం కనబడుతుంది. ప్రజల ఆగ్రహానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో వేల సంఖ్యలు నిరసన కారులు గురువారం సాయంత్రం అధ్యక్షుడి భవనం ముందుకు చేరుకున్నారు. ప్రస్తుత పెరిగిపోతున్న ధరలను  అదుపు చేయాలని, పరిష్కారాలపై మార్గాలను అన్వేషించాలని.. డిమాండ్ చేస్తూ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఇంటి సమీపంలోని రహదారిపై నిరసన కారులు గుమిగూడారు. పోస్టర్లు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో గొడవ మొదలైంది.

గుంపులుగా బాటిళ్లు, రాళ్లను పోలీసులపై విసిరారు. దీంతో అల్లరి మూకలను నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అక్కడ నానా హంగామా చేశారు. అద్దాలు పగులగొట్టడం, రాళ్లను విసరటం చేశారు. ఆ ప్రాంతంలో..  చట్టుపక్కల నిరసనకారుల గుంపు భవనాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు సంఘటన స్థలంలో  కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీని రంగంలోనికి దింపాలని భావిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు