హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Australia : కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా భారీ నిరసనలు -కరోనా ఆంక్షలపైనా జనం తిరుగుబాటు

Australia : కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా భారీ నిరసనలు -కరోనా ఆంక్షలపైనా జనం తిరుగుబాటు

ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక ప్రదర్శనలు

ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక ప్రదర్శనలు

వైరస్ పేరుతో వ్యక్తుల స్వేచ్ఛను ప్రభుత్వం హరించివేస్తోందని, కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఫలానా చోట్ల ఎంట్రీ అని చెప్పడం మానవ హక్కుల ఉల్లంఘననే అని నిరసనకారులు గళమెత్తారు. ఆస్ట్రేలియాలో జాతీయవాద పార్టీల మద్దతుతో యాంటీ వ్యాక్సినేషన్ నిరసనలు ఊపందుకున్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి గడిచిన రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా 51.60లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ (covid vaccine) అందుబాబులోకి రావడంతో మరణాల ఉధృతి కొద్దిగా తగ్గింది. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. కొవిడ్ మరణాలు అదుపులోకి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, రోజుకో రకంగా రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ మళ్లీ ఎప్పుడైనా ప్రపంచాన్ని ముంచెత్తొచ్చనే అనుమానాల నేపథ్యంలో చాలా దేశాల్లో కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. యూరప్ దేశమైన ఆస్ట్రియాలో నాలుగో వేవ్ కూడా మొదలైనట్లు అక్కడి అధికారులు నిర్ధారించారు. కొవిడ్ పీడ ఇంకా విరగడ కానప్పటికీ, విచిత్రంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ వ్యతిరేక నిరసనలు, కొవిడ్ ఆంక్షలపై తిరుగుబాట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా (Australia) లో యాంటీ వ్యాక్సిన్ నిరసనకారులు దేశంలోని ప్రధాన పట్టణాల్లో బలమైన ప్రదర్శనలు నిర్వహించారు.

ఆస్ట్రేలియాలో జాతీయవాద పార్టీల మద్దతుతో యాంటీ వ్యాక్సినేషన్ నిరసనలు ఊపందుకున్నాయి. శనివారం నాడు దాదాపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలను జరిగాయి. కొవిడ్ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో కొవిడ్ వ్యాపించకుండా విధించిన నిబంధనలను సైతం తప్పుపడుతున్నారు. వైరస్ పేరుతో వ్యక్తుల స్వేచ్ఛను ప్రభుత్వం హరించివేస్తోందని, కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఫలానా చోట్ల ఎంట్రీ అని చెప్పడం మానవ హక్కుల ఉల్లంఘననే అని నిరసనకారులు గళమెత్తారు.

China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు


ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం మెల్ బోర్న్ లో వేలాది మంది యాంటీ వ్యాక్సిన్ నిరసనకారులు రోడ్లపైకొచ్చి ప్రదర్శనలు చేశారు. వ్యాక్సిన్ వ్యతిరేక, కొవిడ్ ఆంక్షల వ్యతిరేక నినాదాలు రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు. సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్, తదితర నగరాల్లోనూ ర్యాలీలు జరిగాయి. అయితే, వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలకు పోటీగా టీకాల మద్దతు దారులైన చిన్న చిన్న గ్రూపులు సైతం ఇవాళ ప్రదర్శనలు చేశాయి. ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేయడం, వ్యాక్సిన్లు ఇవ్వడం వల్లే ఆస్ట్రేలియా సేఫ్ గా ఉండిందని వారు వాదిస్తున్నారు.

భువనేశ్వరి బాధ, చంద్రబాబు ఏడుపు.. నారా లోకేశ్ మౌనం! -సీఎం జగన్‌పై టీడీపీ నేత తాజా విమర్శలు


ఆస్ట్రేలియాలో ఇప్పటిదాకా సుమారు 2లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో సుదీర్ఘకాలంపాటు సరిహద్దుల్ని మూసేసి, ఇటీవలే రీఓపెన్ చేశారు. సినిమాహాళ్లు, ప్రయాణాలు, అడ్మిషన్లు తదితరవాటికి వ్యాక్సినేషన్ ఉండాలనే నిబంధనలను జాతీయవాదులు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఆస్ట్రేలియాలో బలవంతపు వ్యాక్సినేషన్ విధానం లేకున్నా, 16 ఏళ్లు నిండినవారిలో 85 శాతం మంది స్వచ్ఛందంగా టీకాలు పొందారు.

Published by:Madhu Kota
First published:

Tags: Australia, Coronavirus, Covid, Covid -19 pandemic, Covid vaccine

ఉత్తమ కథలు