ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అంటుకుంది. దీంతో ఆగ్నేయ ప్రాంతంలో అడవులు నిలువునా కాలిపోయి మసి అయిపోయాయి. అయితే నూతన సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు తరలివచ్చిన పర్యాటకులు మంటల తాకిడికి సమీపంలోని బీచ్‌లకు పారిపోవాల్సి వచ్చింది. న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని బీచ్‌లకు దాదాపు 4 వేల మంది పారిపోయి వచ్చారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్ బాంబ్లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్ వేల్స్ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం తెలిపింది. అధికారులు మాట్లాడుతూ ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident