కారోనా భయాల మధ్య షాకింగ్ ఘటన...వేల సంఖ్యలో వలస పక్షులు మృతి

ఓవైపు కారోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరోవైపు మారుతన్న వాతావరణ పరిస్థితులు కూడా పెను ముప్పుగా పరిణమించాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘటనలు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి.

news18-telugu
Updated: September 18, 2020, 11:22 AM IST
కారోనా భయాల మధ్య షాకింగ్ ఘటన...వేల సంఖ్యలో వలస పక్షులు మృతి
మృత్యువాత పడ్డ పక్షి(క్రెడిట్-Twitter/Allison Salas)
  • Share this:
ఓవైపు కారోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరోవైపు మారుతన్న వాతావరణ పరిస్థితులు కూడా పెను ముప్పుగా పరిణమించాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘటనలు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నాయి. తాజాగా న్యూ మెక్సికోలో వేల సంఖ్యలో వలస పక్షులు అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. పరిశోధకులకు కూడా వీటి మృతికి గల కారణాలు అంతుచిక్కకపోడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం న్యూమెక్సికోలోనే కాకుండా అరిజోనా, కొలరాడో మరియు టెక్సాస్‌లో కూడా పక్షులు ఇదే రీతిలో మృతి చెందాయి.

మృత్యువాత పడ్డ పక్షుల్లో పిచ్చుకలు, బ్లాక్ బర్డ్స్, బ్లూ బర్డ్స్, ఫ్లై కాచర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు పక్షుల మరణానికి గల కారణలు ధ్రువీకరించబడలేదు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఇటీవల న్యూ మెక్సికోలో ఏర్పడిన కరువు పరిస్థితులు, పశ్చిమంలో సంభవించిన కార్చిచ్చు కూడా కారణమయి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, పెద్ద సంఖ్యలో పక్షులు అనుమానస్పద స్థితిలో స్పందించిన ఎన్ఎంఎస్‌యూ జీవ శాస్త్రవేత్త మర్తా డెస్మండ్.. ఇది చాలా భయంకరమైనదని తెలిపారు. మనం చూస్తున్న ఘటన పరిధి చాలా పెద్దది.. ఇదే పద్ధతిలో మరిన్ని పక్షులు కూడా చనిపోయే అవకాశం లేకపోలేదని అన్నారు.


ఇక, ఇదే ఏడాది ఆగస్టులో తొలిసారిగా పెద్ద సంఖ్యలో పక్షులు మృతి చెందడాని యూఎస్ ఆర్మీ దళాలు గుర్తించాయి. యూఎస్‌లోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. పెద్ద ఎత్తున్న జీవ వైవిధ్య అసమతుల్యతకు దారితీసే అవకాశం ఉంది. ఒక, వన్యప్రాణుల మరణాలపై పర్యావరణ, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading