Viral Song: పాటగా మారిన ట్రంప్, బిడెన్ డిబేట్... నెటిజన్ల నవ్వులే నవ్వులు

Viral Song on Donald Trump and Joe Biden: ఆ యూట్యూబర్‌కి కొంచెం కామెడీ పాళ్లు ఎక్కువ. అత్యంత సీరియస్ డిబేట్‌ను కామెడీ చేసిపారేశాడు. నెటిజన్లు అతని క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.

news18-telugu
Updated: October 4, 2020, 12:37 PM IST
Viral Song: పాటగా మారిన ట్రంప్, బిడెన్ డిబేట్... నెటిజన్ల నవ్వులే నవ్వులు
పాటగా మారిన ట్రంప్, బిడెన్ డిబేట్... నెటిజన్ల నవ్వులే నవ్వులు (credit - youtube)
  • Share this:
Viral Song on Donald Trump and Joe Biden: ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా గురించి మాట్లాడుకుంటోంది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. మొదటిది కరోనా వైరస్, రెండోది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడం, మూడోది అమెరికా అధ్యక్ష ఎన్నికలు, నాలుగోది... ఈమధ్య ట్రంప్, బిడెన్ మధ్య జరిగిన డిబేట్‌లో బిడెన్ ఓ మెట్టు పైన నిలవడం... ఇలా ఇన్ని అంశాలున్నాక... ప్రపంచం సైలెంట్‌గా ఎందుకుంటుంది. నవంబర్ 2న జరిగే... అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరన్న అంశంపై భారీ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అసలు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా అనే యాంగిల్ కూడా చర్చకొస్తోంది. కారణం... ట్రంప్‌కి వెంటనే కరోనా తగ్గకపోతే ఏంటి పరిస్థితి అనే విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. ట్రంప్ స్థానంలో ఉపాధ్యక్షుడికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇవన్నీ అలా ఉంటే... ఈమధ్య జరిగిన ట్రంప్, బిడెన్... ప్రెసిడెన్షియల్ డిబేట్‌కి కామెడీ జోడించాడు ఓ యూట్యూబర్. దాంతో... సీరియస్ డిబేట్ కాస్తా... కామెడీ పీస్ అయిపోయింది.

ట్రంప్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మీమ్స్ పుట్టుకొస్తున్నట్లే... కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. ప్రతి అంశాన్నీ నెటిజన్లు సీరియస్‌గా తీసుకుంటూనే... కామెడీ యాంగిల్ కూడా స్వాగతిస్తున్నారు. అమెరికా మ్యుజీషియన్, సాంగ్ రైటర్ వియర్డ్ అల్ యంకోవిక్... ఈ కొత్త వీడియో చేశాడు. మొత్తం డిబేట్‌లో కొన్ని పదాలను కట్ చేసి... వాటికి మ్యూజిక్ సెట్ చేశాడు. తనే డిబేట్ నడిపించినట్లుగా మధ్య మధ్యలో పాట రూపంలో మాట్లాడాడు. ఇలా ఏదేదో చేసి... మొత్తానికి అందర్నీ మెప్పించే కామెడీ వీడియో సాంగ్ తయారుచేశాడు. అతను వాడిన క్యాచీ బీట్స్, ట్యూన్ నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది.


ఈ వీడియోకి వుయ్ ఆర్ ఆల్ డూమ్డ్ అనే టైటిల పెట్టి యూట్యూబ్‌లో వదిలాడు యంకోవిక్. ఇందులో ట్రంప్, బిడెన్ చెప్పే సమాధాలు... పాటలాగే సాగుతుండటం విశేషం. చాలా మంది నెటిజన్లు నిజమైన డిబేట్ బోరింగ్ గా ఉందనీ... ఇది బాగుందన అంటున్నారు. ఈ డిబేడ్ క్లిప్పింగ్స్‌కి మోడరేటర్‌గా యంకోవిక్ చేసిన హంగామా మరింత కామెడీని పెంచింది. ఒకరకంగా యంకోవిక్ ఈ డిబేట్‌పై సెటైర్లు వేసినట్లే అంటున్నారు కొందరు.

రాజకీయ నేతల ప్రసంగాలు, చర్చలు, లైవ్ షోలపై రాన్రానూ ప్రజలకు ఆసక్తి తగ్గిపోతోంది. ఎవరో కొందరు నేతలు తప్పితే... మిగతా వాళ్లు చెప్పేది వినడానికి కూడా నెటిజన్లు ఆసక్తి చూపరు. అంత చప్పగా సాగుతుంటాయి వారి ప్రసంగాలు. అమెరికన్లలో చాలా మంది ట్రంప్ చెప్పే విషయాల్ని ఇలాగే చూస్తున్నారు. అందుకే ఇలాంటి వీడియోలు, మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: October 4, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading