6 గంటలు గుండె ఆగిపోయినా తిరిగి బతికిన మహిళ... ఎలాగంటే...

గుండెపోటు అనేది సినిమాల్లో చూపించినట్లుగా... ఓ నొప్పిలా వచ్చి... కాసేపు ఇబ్బంది పెట్టి... ఆ తర్వాత ప్రాణం తీసే రకం కాదు. అది వచ్చిందంటే... క్షణాల్లోనే... రెప్పపాటులోనే ప్రాణం పోతుంది. గుండె వెంటనే ఆగిపోతుంది. మరి ఆ మహిళ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 7, 2019, 11:55 AM IST
6 గంటలు గుండె ఆగిపోయినా తిరిగి బతికిన మహిళ... ఎలాగంటే...
డాక్టర్ల బృందంతో ఆండ్రీ (image : twitter - BirdOwl)
  • Share this:
ఆండ్రీ షూమాన్ (34)కి... హైపోథెర్మియా టైపు గుండెపోటు వచ్చింది. ఆమెను చెక్ చేసిన భర్త... గుండె కొట్టుకోవడం లేదని తెలుసుకున్నాడు. ఆమె చనిపోయిందని అనుకున్నాడు. ఈ ఫ్యామిలీ స్పెయిన్‌లోని పైర్నీస్ పర్వత శ్రేణులపై ఉంటున్నారు. నవంబర్‌లో అక్కడ మంచు తుఫాను వచ్చింది. ఆ సమయంలోనే ఆండ్రీకి గుండెపోటు వచ్చింది. ఆమె పల్స్ కొట్టుకోవడం మానేసింది. ఊపిరి తీసుకోవట్లేదు. గుండె ఆగిపోయింది. వెంటనే రోహన్... అంబులెన్స్‌కి కాల్ చేసి... ఆమెను బార్సెలోనాలోని వాల్ డిహెబ్రోన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. డాక్టర్ జోర్డీ రీరా... ఆండ్రీకి ట్రీట్‌మెంట్ చేశారు. జనరల్‌గా గుండె ఐదు లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలు కొట్టుకోవడం మానేస్తే... బ్రెయిన్ పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. కానీ ఆండ్రీ షూమాన్... ఆరు గంటల పాటూ గుండె కొట్టుకోవడం మానేసినా... తిరిగి బతికారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

మంచు తుఫాను వచ్చినప్పుడు... ఆండ్రో బాడీ టెంపరేచర్ 18 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది. గుండె ఆగిపోయింది. బ్రెయిన్ కూడా పనిచేయడం బాగా నెమ్మదించింది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందలేదు. ఇంతకీ ఆమె ఎలా బతకగలిగిందన్న అంశానికి డాక్టర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆమెను ఆస్పత్రికి తెచ్చినప్పుడు... తిరిగి బాడీ టెంపరేచర్ నార్మల్‌కి వచ్చేలా చేశారు. దాంతో ఆమె గుండె తిరిగి పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఓవరాల్‌గా ఆమె గుండె ఆరు గంటలు ఆగిపోయిందని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ అసాధ్యం ఎలా సుసాధ్యమైందని అడిగితే డాక్టర్లు... ఇదో అద్భుతం (మిరాకిల్) అంటున్నారే తప్ప... కచ్చితమైన కారణం తెలియదంటున్నారు.

Pics : చూపులతోనే పిచ్చెక్కిస్తున్న రిద్దికుమార్
ఇవి కూడా చదవండి :

సింహానికి మహిళ పిడిగుద్దులు... పెంపుడు కుక్క కోసం...

Health : ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది?Health : బేబీ ఆయిల్ బెనిఫిట్స్... ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమే...

Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
Published by: Krishna Kumar N
First published: December 7, 2019, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading