ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఆ జంటకు 21 మంది సంతానం..

సుయ్ తనకు 13ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు ఆమె భర్త నోయెల్ వయసు 18. ఈ విషయం తెలిసిన చాలామంది వీరిపై మండిపడుతున్నారు.

news18-telugu
Updated: January 8, 2019, 10:52 PM IST
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఆ జంటకు 21 మంది సంతానం..
21మంది సంతానంతో సుయ్-నోయెల్ దంపతులు..(Image:Facebook)
  • Share this:
'మనం ఇద్దరం.. మనకు ఇద్దరు..' ఈరోజుల్లో పెళ్లయిన చాలామంది జంటలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఒకరితోనే సరిపెట్టేస్తున్నవాళ్లూ లేకపోలేదు. ఈరోజుల్లో పిల్లలను పెంచడం, చదవులు చెప్పించడం.. అంతా బడ్జెట్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి.. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా చాలామంది జంటలు ఒకరిద్దరు సంతానానికే గాబరా పడిపోతుంటే.. ఓ మహిళ మాత్రం ఏకంగా 21 మంది సంతానాన్ని కన్నదంటే నమ్మగలరా.. కానీ నమ్మి తీరాల్సిందే..

ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఓ టెలివిజన్ చానెల్‌లో సుయ్-నోయెల్ అనే దంపతులపై ఓ వార్తా కథనం ప్రసారమైంది. వీరిద్దరికి 21 మంది సంతానం ఉన్నారన్నది ఆ కథనం సారాంశం. ఈ కార్యక్రమాన్ని చూసిన చాలామంది బ్రిటన్ ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ జంట వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. 2008 నాటికే 13మంది సంతానాన్ని కని వీరు వార్తల్లోకి ఎక్కారు. మళ్లీ ఇన్నాళ్లకు 21మంది సంతానంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అంటే ఈ తొమ్మిదేళ్లలో మరో ఎనిమిది పిల్లలకు సుయ్ జన్మనిచ్చింది.

సుయ్ తనకు 13ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు ఆమె భర్త నోయెల్ వయసు 18. ఈ విషయం తెలిసిన చాలామంది వీరిపై మండిపడుతున్నారు. 13ఏళ్లకే ఆమెను గర్భవతిని చేయడం నేరంగా పరిగణించాల్సిన విషయం అంటున్నారు. మరికొంతమందేమో 21 మంది సంతానం కలిగి ఉండటంపై సెటైర్స్ వేస్తున్నారు. నోయెల్ ఓ బేకరీ వర్కర్ కావడంతో.. ఇంకేముంది బేకర్ జోన్ లాగా.. 'బేకర్స్ డజన్' ఒకటి పెట్టుకోమని సలహాలిస్తున్నారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. 21మంది సంతానంతో ఆ దంపతులు మాత్రం సంతోషంగానే ఉన్నారు.
First published: January 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...