హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Salary Hike : ఉద్యోగానికి రిజైన్ చేసినవాళ్లకి గుడ్ న్యూస్..నోటీస్ పీరియడ్ లో నెలకు 10శాతం ఎక్స్ ట్రా శాలరీ

Salary Hike : ఉద్యోగానికి రిజైన్ చేసినవాళ్లకి గుడ్ న్యూస్..నోటీస్ పీరియడ్ లో నెలకు 10శాతం ఎక్స్ ట్రా శాలరీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

10 Percent Salary Hike : ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు(Employees)తమ ఉద్యోగానికి రిజైన్(Resign)చేసినప్పుడు లేదా మానేసినప్పుడు నిబంధనల ప్రకారం నోటీసు పీరియడ్(Notice Period)ని పూర్తి చేయాలి

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

10 Percent Salary Hike : ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు(Employees)తమ ఉద్యోగానికి రిజైన్(Resign)చేసినప్పుడు లేదా మానేసినప్పుడు నిబంధనల ప్రకారం నోటీసు పీరియడ్(Notice Period)ని పూర్తి చేయాలి. నోటీసు వ్యవధిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగులను మరొక సంస్థకు వెళ్లడానికి కంపెనీ అనుమతిస్తుంది. అయితే ఉద్యోగులను కార్యాలయం నుండి నిష్క్రమించమని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అమెరికా ప్రధానకేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ ఉద్యోగులకు వారి నోటీసు పీరియడ్ లో 10 శాతం అదనపు జీతం ఇస్తామని తెలిపింది.

రాజీనామా చేసిన ఉద్యోగులకు 10శాతం అదనపు వేతనం

యుఎస్ మార్కెటింగ్ కంపెనీ గొరిల్లా.. "నోటీస్ పీరియడ్ లో ప్రొడక్టివిటీని పెంచడానికి రాజీనామా నిర్ణయాన్ని గౌరవించేలా మేము రాజీనామా చేసిన ఉద్యోగుల జీతాన్ని పెంచాము."అని తెలిపింది. మార్కెటింగ్ కంపెనీ గొరిల్లా వ్యవస్థాపకుడు జాన్ ఫ్రాంకో ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. ఉద్యోగి మూడు నెలల నోటీసు పీరియడ్ ని అందజేసే ప్రక్రియ కంపెనీ ముందుకు సాగడానికి, కొత్త వ్యక్తిని నియమించుకోవడానికి, వారందరి మధ్య సజావుగా మారడానికి వీలు కల్పిస్తుందని ఫ్రాంకో చెప్పారు.

Cheetahs In India : 70 ఏళ్ల తర్వాత భారత్ లో చీతాలు..కునో నేషనల్ పార్క్ లో వదిలిన మోదీ

"మా ఉద్యోగి ఒకరు రాజీనామా చేస్తే, వారు నోటీసు వ్యవధిలో భాగంగా 6 నెలలు పని చేయాల్సి ఉంటుంది. కానీ మేము ఉద్యోగులపై కఠినమైన నిబంధనలు విధించడం ఇష్టం లేదు. అలాగే వారికి కొత్త ఉద్యోగం దొరకడానికి కొంత సమయం పడుతుంది. అందుకే కేవలం 3 నెలల్లోనే వెళ్లిపోయేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. మిగిలిన మూడు నెలలకు మేము వారికి 10శాతం అదనపు జీతం కూడా ఇస్తాం. కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల కోసం కంపెనీ ఎలా సిద్ధం చేయాలనే దాని గురించి ఆలోచించడానికి ఇది మాకు సమయం ఇస్తుంది"" అని ఫ్రాంకో లింక్డ్‌ఇన్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌కు వేల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు కూడా వచ్చాయి.

ఫ్రాంకో పోస్ట్‌పై ఒక నెటిజన్.. "ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన విధానం, అయితే 10శాతం పెంపుతో ప్రయోజనం పొందని మీ విశ్వసనీయ ఉద్యోగులకు ఇది ఏమి చెబుతుంది?" అని ప్రశ్నించగా దీనికి ఫ్రాంకో బదులిస్తూ.., "వారు సాధారణంగా ఏటా 10శాతం కంటే ఎక్కువ శాలరీ పెంపుని పొందుతున్నారు, అదనంగా, ఉద్యోగ అనుభవం బలంగా ఉంది"అని తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Hike salary, Private employee, Salary Hike, USA

ఉత్తమ కథలు