హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Unlucky Couple: అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్.. లాటరీ గెల్చుకున్న తరువాత అష్టకష్టాలుపడ్డ దంపతులు

Unlucky Couple: అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం షేక్ హ్యాండ్.. లాటరీ గెల్చుకున్న తరువాత అష్టకష్టాలుపడ్డ దంపతులు

 Credit: ITV/GMTV

Credit: ITV/GMTV

బ్రిటన్‌లో ఓ జంట రూ.31 కోట్లు(3 మిలియన్ పౌండ్లు) విలువ చేసే లాటరీని గెలుచుకుని అదృష్టవంతులుగా గుర్తింపు దక్కించుకున్నారు. కానీ లాటరీ టిక్కెట్టు పోగొట్టుకోవడంతో వారికి ఆ సొమ్ము దక్కలేదు.

లాటరీలో డబ్బు గెలుచుకోవడమంటే అదృష్టం తలుపుతట్టినట్లే. అప్పటివరకు అనుభవించిన కష్టాలకు ప్రతిఫలం దక్కినట్లే. అయితే ఆ లాటరీ టిక్కెట్ పోగొట్టుకుంటే.. అంతకంటే దురదృష్టం ఉండదు. డబ్బు గెలిచినందుకు ఆనందించాలో.. టిక్కెట్ కోల్పోయినందుకు బాధపడాలో అర్థం కాని విచిత్ర పరిస్థితి అది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు బ్రిటన్ దంపతులు. బ్రిటన్‌లో ఓ జంట రూ.31 కోట్లు(3 మిలియన్ పౌండ్లు) విలువ చేసే లాటరీని గెలుచుకుని అదృష్టవంతులుగా గుర్తింపు దక్కించుకున్నారు. కానీ లాటరీ టిక్కెట్టు పోగొట్టుకోవడంతో వారికి ఆ సొమ్ము దక్కలేదు. ఈ గొడవలతో దంపతులిద్దరూ విడాకులు తీసుకున్నారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే బ్రిటన్ లో మార్టీన్ టాట్, కే దంపతులు 2001లో లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశారు. లాటరీ నంబర్ ను చెక్ చేసుకుని చూడగా విజేతగా నిలిచింది తామేనని ఆనందపడ్డారు. అయితే తీరా ఆ బహుమతిని ఇంటికి మాత్రం తీసుకెళ్లలేకపోయారు. కారణం లాటరీ టిక్కెట్టు కోల్పోవడమే. ఫలితంగా సొమ్ము దక్కలేదు. లాటరీ నిర్వాహక సంస్థ క్యామ్లెట్ కూడా టిక్కెట్టు తప్పనిసరి అని నొక్కి చెప్పింది. టిక్కెట్టు కోల్పేతే డబ్బు ఇవ్వమనే నిబంధన గురించి స్పష్టంగా తెలియజేసింది. లాటరీ టిక్కెట్టు కోల్పోతే 30 రోజుల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలనే విషయాన్ని ఎత్తి చూపింది. అయితే మార్టిన్ దంపతులు మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. లాటరీకి సంబంధించిన కంప్యూటర్ రికార్డులు, పత్రాలను చూపించినా ఫలితం అందలేదు. ఐదేళ్ల పాటు లాటరీ కోసం పోరాడినప్పటికీ రిక్త హస్తాలే మిగిలాయి. చివరకు ఇరువురు విడాకులు తీసుకున్నారు.

"నేను తనపై తగినంత శ్రద్ధ పెట్టలేదని ఆమె అనుకుంది. తప్పును సరిదిద్దడానికి అవకాశాన్ని ఆమె విస్మరించిందని నేను అనుకున్నా. మేము ఒకరినొకరు రెండేళ్ల పాటు మాత్రమే అర్థం చేసుకున్నాం. లాటరీ మా మధ్య విభేదాలకు కారణమైంది. దీంతో ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని మార్టిన్ 2011లో ఒక వార్తాసంస్థకు చెప్పారు.

2001లో ఈ వార్త సంచలనం రేపింది. అప్పటి యూకే ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా దంపతుల లాటరీ వ్యవహారంపై స్పందించారు. మార్టిన్ న్యాయ బృందం క్యామ్లెట్ కు వ్యతిరేకంగా హైకోర్టుకు రిట్ కూడా జారీ చేసింది. అయితే న్యాయపరమైన రుసుముల కారణంగా అతను కేసు నుంచి వైదొలిగాడు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. నవంబరు 2021లో అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ 26 మిలియన్ డాలర్ల లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసింది. అయితే ఆ సొమ్మును దక్కించుకోలేకపోయింది. లాస్ ఏంజెల్స్ శివారు ప్రాంతంలో నార్వాక్ లో ఆర్కో AM/PM కన్వీనియన్స్ స్టోర్ లో విక్రయించారు. అయితే దాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.

First published:

Tags: Viral

ఉత్తమ కథలు