Home /News /international /

THIS UK FINANCE FIRM PLANS TO HIRE 600 TECHIES FROM INDIA OVER NEXT FEW YEARS GH VB

Tide Recruitment: భారత్​లో కార్యకలాపాలు విస్తరించనున్న టైడ్.. రానున్న రెండేళ్లలో 600 మంది నియామకం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార, ఆర్థిక సంస్థ టైడ్​ భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. 2026 నాటికి భారతదేశం నుంచి 600 మంది టెక్‌ ప్రొఫెషనల్స్‌ను నియమించుకునే ఆలోచనలో ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార, ఆర్థిక సంస్థ టైడ్​ భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. 2026 నాటికి భారతదేశం నుంచి 600 మంది టెక్‌ ప్రొఫెషనల్స్‌ను నియమించుకునే ఆలోచనలో ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఇన్నాళ్లు యూనైటెడ్‌ కింగ్‌డమ్‌కే పరిమితమైన టైడ్​ సంస్థకు భారత్‌ తొలి అంతర్జాతీయ మార్కెట్‌ కాబోతోంది. కొత్తగా చేర్చుకునే 600 మంది టెక్కీలు కంపెనీ ఉద్యోగుల్లో 60 శాతం కానున్నారు. వాస్తవానికి వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 1000 ఉద్యోగులు సృష్టిస్తామని ఈ ఏడాది ఈ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లోని Tide కేంద్రంలో రానున్న 18-24 నెలల్లో 300 ఇంజినీర్లు రకరకాల్లో హోదాలో చేరనున్నారు. డేటా సైన్స్, ఫ్లట్టర్‌ నిపుణులతో పాటు జావా, పైథాన్‌లో నిపుణులైన ఇంజినీర్లను బ్యాక్‌ ఎండ్‌లో తీసుకోనుంది.

Shocking: పెళ్లి చేసుకున్నా ఆమెకు ఆ కోరిక మాత్రం పోలేదు.. చివరకు ఆమె ఎంతటి ఘనకార్యం చేసిందో చూడండి..


“భారత్‌లో లోతుగా విస్తరించి, రేపటి సాంకేతిక దిగ్గజాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ అదనపు సాంకేతిక సామర్ధ్యంతో మాకు ఉపయోగపడుతుంది.భారత్‌కు అవసరమైన ప్రొడక్ట్స్ మేము రూపొందించగలుగుతాము” అని అన్నారు టైడ్​ ఇండియా సీఈఓ గురుజోధ్‌పాల్‌ సింగ్‌. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఇక్కడి మార్కెట్‌ నుంచి మంచి స్పందనను తాము అందుకున్నామని సింగ్‌ వెల్లడించారు. భారత్‌లో టైడ్‌ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో ప్రస్తుతం 350 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఇందులో చాలా మంది 2020లో హైదరాబాద్‌లో నెలకొల్పిన టెక్నాలజీ సెంటర్‌లోనే ఉన్నారు.

ఐఐటీ, ఎన్​ఐటీ గ్యాడ్యుయేట్లకు ఇంటర్న్​షిప్​..
అత్యుత్తమ నైపుణ్యాన్ని ఆకర్షించి, మెరుగులు దిద్దేందుకు “ఇంటర్న్‌షిప్‌ టూ హైర్‌” కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో టైడ్​ సంస్థ ఉంది. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి అత్యున్నత సంస్థల నుంచి ఎంట్రీ లెవల్‌ అభ్యర్థులను నియమించుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ విధానంలో విజయం సాధిస్తే నియామకాలాను క్రమంగా పెంచుకుంటూ కోవాలనే ఆలోచనలో ఉంది. విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం టెక్నాలజీపరంగా ఉన్న నైపుణ్య కొరతను టైడ్​ చేపట్టే “ఇంటర్న్‌షిప్‌ టూ హైర్‌” భర్తీ చేస్తుంది. ఐఐటీ, ఎఐటీలకు చెందిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది.

Student Suicides: ఆత్మహత్యలు తగ్గాలంటే హాస్టల్ గదిలో వాటిని తొలగించాలని నిర్ణయం.. మండిపడుతున్న విద్యార్థులు..


ఈ మధ్యే చాలా అంతర్జాతీయ కంపెనీలు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) విద్యార్థులకు అనేక ఉద్యోగాలు అందించారు. ఖరగ్‌పూర్‌, మద్రాసు, గౌహతి, రూర్కీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఈ నెలలో 220 అంతర్జాతీయ ఉద్యోగాలు పొందారు. యూకేకి చెందిన Tide (టైడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌) చిన్న, మధ్యస్థాయి సంస్థలకు మొబైల్‌ ఆధారిత బ్యాంకింగ్‌ సేవలందిస్తుంది. వ్యాపార సంస్థలు కరెంట్‌ అకౌంట్ ఏర్పాటు చేసుకునేలా చూసి తక్షణమే అవి రకరకాల ఆర్థిక సేవలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: JOBS, Tide, United Kingdom

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు