సైన్స్ ప్రకారం.. ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా?

గోల్డెన్ రేషియో ప్రకారం.. హదీద్ ముఖం 94.35శాతం పర్ఫెక్ట్ కొలతతో ఉందని స్పష్టం చెబుతున్నారు. ఆమె తర్వాతి స్థానంలో పాప్ దివా బెయాన్స్ 92.44శాతంతో ఉందన్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 8:27 AM IST
సైన్స్ ప్రకారం.. ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా?
బెల్లా హదిద్
  • Share this:
సూపర్ మోడల్ 'బెల్లా హదిద్‌'(23) ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ అని..ప్రపంచం మొత్తానికి కాకపోయినా గ్రీకు మ్యాథమేటిక్స్ ప్రకారమైనా ఆమె అందం అందరికంటే మిన్న అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాచీన గ్రీకు లెక్కల ప్రకారం.. ఆమె శరీర సౌష్టవం 'గోల్డెన్ రేషియో' స్టాండర్డ్స్‌‌కి సరిపోయేలా ఉందని తెలిపారు.గోల్డెన్ రేషియో ప్రకారం.. హదీద్ ముఖం 94.35శాతం పర్ఫెక్ట్ కొలతతో ఉందని స్పష్టం చెబుతున్నారు. ఆమె తర్వాతి స్థానంలో పాప్ దివా బెయాన్స్ 92.44శాతంతో ఉందన్నారు. నటి అంబర్ హర్డ్ 91.85శాతంతో మూడో స్థానంలో, పాప్ స్టార్ అరియానా గ్రాండే 91.81శాతంతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ మోడల్స్‌కు సంబంధించిన కొలతలన్నీ డా.జులియన్ ది సిల్వా పరిశీలించారు. లండన్‌లోని ప్రఖ్యాత హార్లే స్ట్రీట్‌లో ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్‌గా ఆమె పనిచేస్తున్నారు.

ఏవిధంగా చూసుకున్నా అందంలో బెల్లా హదిద్ అందరి కంటే ముందుంది. శారీరక కొలతల్లో మిగతావాళ్ల కంటే ఆమె శరీరం అన్ని విధాలా గోల్డెన్ రేషియోకి సరిపోయేలా ఉంది. ముఖ్యంగా ఆమె గదుమ(చిన్) అత్యంత పర్ఫెక్ట్‌గా 99.7శాతం కొలతతో ఉంది. ఆమె ముఖం 94.35శాతం పర్ఫెక్ట్ కొలతతో ఉంది.
డా.జులియన్View this post on Instagram

Summer came like cinnamon Sosweet 🍯

A post shared by 🦋 (@bellahadid) onFirst published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు