వరి పంటను కాపాడే రోబో... జపాన్ ఇంజినీర్ల సృష్టి

Robot Duck : డక్ (బాతు) అని పిలిచే ఈ రోబో... వరి చేలలో తిరుగుతూ... నిరంతరం వాటిని గమనిస్తూ... కలుపు మొక్కల్ని తీసిపారేస్తుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 23, 2019, 9:28 AM IST
వరి పంటను కాపాడే రోబో... జపాన్ ఇంజినీర్ల సృష్టి
వరి చేలలో డక్ రోబో
  • Share this:
ఆసియా దేశాల్లో పంట చేలలో పురుగుల్ని తినేందుకు బాతుల్ని ఉపయోగించేవారు. ఆ బాతులు... పంట చేలలో తిరుగుతూ... కలుపు మొక్కల్ని చీరేస్తూ... అక్కడి పురుగుల్ని స్నాక్స్‌లా తినేవి. బాతుల వ్యర్థాలు ఆ మొక్కలకు ఎరువుల్లా ఉపయోగపడేవి. ఇదో సంప్రదాయ వ్యవసాయ కిటుకు. 21వ శతాబ్దంలో ఈ పద్ధతులు పెద్దగా పాటించట్లేదు. ఐతే... జపాన్ శాస్త్రవేత్తలు ఇదే పద్ధతికి టెక్నాలజీని సెట్ చేసి... కొత్త ట్విస్ట్ తెచ్చారు. జపాన్ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్... బాతుల్లా పనిచేసే ఓ రోబోను తయారుచేశారు. ప్రస్తుతం ఆ రోబోపై జపాన్ ఈశాన్య ప్రాంతం యమగటలోని వరి పొలాల్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఇది సక్సె్స్ అయితే... జపాన్ అంతటా ఈ రోబోలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఐగామో (Aigamo) రోబో లేదా డక్ రోబోగా పిలుస్తున్న ఈ మెషిన్... 1.5 కేజీల బరువుంది. పెద్దసైజు వాక్యూమ్ క్లీనర్ అంత ఉంటుంది. బాతుకి కాళ్లు ఉన్నట్లుగా దీనికి కింద రెండు రబ్బర్ బ్రషెస్ ఉన్నాయి. అవి తిరుగుతుంటే రోబో ముందుకు, వెనక్కూ వెళ్తుంది. ఈ సమయంలో నీటిని మజ్జిగ చిలికినట్లుగా చిలుకుతుంది. అందువల్ల నీటిలో కలుపు మొక్కలు ఏర్పడకుండా ఉంటాయి.

టెక్నాలజీని బాగా ఉపయోగించే జపాన్‌లో వరి సాగు, దిగుబడి తగ్గిపోతోంది. ఇలాంటి సమయంలో ఈ రోబో టెక్నాలజీ కొంతవరకైనా మేలు చేస్తుందంటున్నారు.ఇవి కూడా చదవండి :

4 రోజుల తర్వాత శుభకార్యాలు లేవ్... 3 నెలల వరకూ అంతే...

ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ

చైనాలో తగ్గుతున్న జనాభా సంఖ్య... 8 ఏళ్లలో చైనాను వెనక్కి నెట్టబోతున్న ఇండియా...

వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?... పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్...
Published by: Krishna Kumar N
First published: June 23, 2019, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading