USA: ఇంటిని శుభ్రం చేస్తుండగా కాగితం దొరికింది.. దాంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.. ఏం జరిగిందంటే..

కెన్నెత్ మోర్గాన్ (Image credit : twitter)

Florida: ఎవరికైనా అదృష్టం ఎట్నుంచి వస్తుందో.. ఎప్పుడు తగులుతుందో తెలియదు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారనే వార్తలు మనం చాలా వరకు వింటూ ఉంటాం. ఇలా ఓ వ్యక్తికి కూడా ఇలాంటిదే జరిగింది. అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

  • Share this:
    లాక్ డౌన్ లో చాలామంది ఇంటి వద్దే ఉంటూ కాలక్షేపం చేస్తారు. ఉద్యోగం ఉన్న రోజుల్లో కూడా సెలవు దొరికిన సమయంలో నిద్ర పోవడమో లేదా మొబైల్ ఫోన్ పట్టుకొని కాలాన్ని వెల్లదీస్తారు. కానీ అతడు ఇంట్లో ఆ రోజు ఇంటి వద్ద ఉన్నాడు. ఖాళీగా ఉండటం ఎందుకని తన ఇంటిని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇలా చేయడమే అతడికి కలిసి వచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అలా అతడు ఇంటి ఫ్లోర్ ను మొత్తం వస్త్రంతో శుభ్రం చేశారు. చివరకు ఒక టేబుల్ కింద డస్ట్ ఎక్కువగా ఉన్నట్లు కనిపించడంతో కిందకు వంచి మరీ వస్త్రంతో శుభ్రం చేస్తుండగా ఒక కాగితం ముక్క దొరికింది. అది ఏంటా అని పక్కనే ఉన్న కుర్చిపై కూర్చొని చిన్నగా తెరిచాడు. అదేంటో తెలిసి అవాక్కయ్యాడు. అది కాస్త అతడిని కోటీశ్వరుడిని చేసింది. తను నెల రోజుల క్రితం కొన్న లాటరీ టికెట్ అది. టేబుల్ డ్రాయర్‌లో వేస్తే కనిపించకుండా పోయింది. ఆ తర్వాత దాన్ని అతను పట్టించుకోలేదు. ప్రస్తుతం అది దొరకడంతో ఆనందపడ్డాడు. కానీ ఆ లాటరీ టికెట్ కు డబ్బులు వచ్చాయా.. రాలేదా అని వెంటనే తన దగ్గర ఉన్న ల్యాప్ టాప్ ఓపెన్ చేసి చూశాడు. ఆ లాటరీ టికెట్ పై వచ్చిన అమౌంట్ చూసి షాక్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కెన్నెత్ మోర్గాన్‌కు ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు దొరికింది. 54 ఏళ్ల ఈ మోర్గాన్ ఇంట్లో ఖాళీగా ఉండకుండా ల్లు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తుండగా అతనికి ఒక కాగితం ముక్క దొరికింది. ఏంటా ఇది? అని చూసిన అతను.. అదేంటో తెలిసి అవాక్కయ్యాడు. ఇంతకీ దీనికేమన్నా డబ్బులు వచ్చాయా? చూద్దామని చెక్ చేయగా తాను మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు కెన్నెత్‌కు తెలిసింది. ఆనందంలో మునిగిపోయిన కెన్నెత్.. వెంటనే లాటరీ నిర్వాహకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

    తాను జాక్సన్‌విల్లె ప్రాంతంలోని ఒక లిక్కర్ స్టోర్‌లో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్లు కెన్నెత్ వెల్లడించాడు. పవర్‌బాల్ లాటరీ సమయంలో ఈ టికెట్ కొన్నట్లు చెప్పాడు. దీంతో అతన్ని మిలియన్ డాలర్లు వరించాయి. అంటే మన దేశపు లెక్కల్లో రూ.7.5 కోట్లపైగా అన్నమాట. ఈ టికెట్ అమ్మిన లిక్కర్ స్టోర్‌కు కూడా పదివేల డాలర్లు కమిషన్ దక్కుతుందట. ఇల్లు శుభ్రం చేస్తుంటే ఈ లాటరీ టికెట్ కనిపించింది. చెక్ చేస్తే మిలియన్ డాలర్లు గెలిచినట్లు తెలిసింది. తాను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.. అంటూ కెన్నెత్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు.
    Published by:Veera Babu
    First published: