హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Yang Huiyan: ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఏడాదిలోనే ఆ బిలియనీర్ ఆస్తులు ఆవిరి.. చదివితే పాపం అంటారు !

Yang Huiyan: ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఏడాదిలోనే ఆ బిలియనీర్ ఆస్తులు ఆవిరి.. చదివితే పాపం అంటారు !

 ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఏడాదిలోనే ఆ బిలియనీర్  ఆస్తులు ఆవిరి ..  చదివితే పాపం అంటారు !

ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో.. ఏడాదిలోనే ఆ బిలియనీర్ ఆస్తులు ఆవిరి .. చదివితే పాపం అంటారు !

ఆసియా(Asia)లోనే అత్యంత ధనవంతురాలైన యాంగ్ హుయాన్‌ సంపద ఒక్క ఏడాదిలోనే 50 శాతానికి పైగా కరిగిపోయింది. 2021లో ఆమె నికర సంపద 23.7 బిలియన్ డాలర్లుగా ఉంటే ఇప్పుడది 11.3 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్(Billionaire) ఇండెక్స్ వెల్లడించింది.

ఇంకా చదవండి ...

కొన్ని నెలల క్రితం చైనా (China) ప్రవేశపెట్టిన ఓ కొత్త పాలసీ(Policy) కారణంగా అక్కడి రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలయింది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అధికంగా అప్పులు తీసుకోవడానికి వీలు లేదన్నట్టుగా కొత్త పాలసీ రూల్స్ ఉండటంతో చాలా రియల్ ఎస్టేట్(Real Estate) కంపెనీలు భవన నిర్మాణాలు పూర్తి చేయలేక బిక్కమొహం వేస్తున్నాయి. ప్రజలు కూడా రుణాలను చెల్లించడం లేదు. ఫలితంగా సునాక్‌, ఎవర్‌గ్రాండే గ్రూప్ వంటి చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు దివాలా స్థితికి చేరుకున్నాయి. ఈ సంక్షోభం ఆసియాలోనే అత్యంత ధనవంతురాలైన (Asia’s wealthiest woman) యాంగ్ హుయాన్‌ (Yang Huiyan)కి కూడా భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఈ సంక్షోభం వల్ల ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద 50 శాతానికి పైగా కరిగిపోయింది. 2021లో ఆమె నికర సంపద 23.7 బిలియన్ డాలర్లుగా ఉంటే ఇప్పుడది 11.3 బిలియన్ డాలర్లకు తగ్గిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అంటే సగానికి పైగా సంపద ఆవిరైపోయిందని చెప్పవచ్చు.

చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థిక సంక్షోభం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇళ్ల ధరలు తగ్గడం, కొనుగోలుదారుల్లో ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గడం వల్ల ఈ రంగంపై మరింత ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ కారణాల వల్ల రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలోనే హాంకాంగ్ లో లిస్ట్ అయిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కంట్రీ గార్డెన్ (Country Garden) హోల్డింగ్స్ కూడా బుధవారం రోజు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ కంపెనీ ఒక్కో షేరు విలువ 15 శాతం మేర నష్టపోయింది. ఈ దెబ్బకు ఇదే కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్, కో ఛైర్మన్ ఉన్న యాంగ్ హుయాన్‌ ఆస్తి సగానికిపైగా తగ్గిపోయింది

వారసత్వంగా..

యాంగ్ తండ్రి యాంగ్ గుయోకియాంగ్ 1992లో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఫోషన్‌లో కంట్రీ గార్డెన్ కంపెనీని స్థాపించారు. ఆమె 2005లో కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్‌లో మెజారిటీ వాటాను వారసత్వంగా పొందారు. రెండేళ్ల తర్వాత కంపెనీ హాంకాంగ్‌లో లిస్ట్‌ కాగా ఆమె ఒక్కసారిగా ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. 41 ఏళ్ల ఈ మహిళ చైనా అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్‌ను సేల్స్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కంట్రీ గార్డెన్ స్టాక్ దాని వాల్యూలో సగానికి పైగా నష్టపోవడం గమనార్హం. అయితే ఈ కంపెనీలో 13% స్టాక్స్ అమ్మేసి 361 మిలియన్ డాలర్ల డబ్బును సేకరించాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: Pink Diamond: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !



ఇప్పటికీ ఆమెదే రికార్డ్

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్(Billionaire) ఇండెక్స్ ప్రకారం, తన సంపదలో సగానికి పైగా కోల్పోయినా... హుయాన్ ఇప్పటికీ ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలుస్తున్నారు. అయితే, ఆమె నికర సంపద ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆమె సంపద, చైనాలోని తోటి మహిళా బిలియనీర్ల సంపద మధ్య పెద్ద తేడా లేకుండా అయిపోయింది. కెమికల్ ఫైబర్స్ టైకూన్ ఫ్యాన్ హాంగ్‌వేయి (Fan Hongwei) నికర సంపద 11.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే యాంగ్ సంపదను ఫ్యాన్ హాంగ్‌వేయి దాటడానికి కేవలం 100 మిలియన్ల సంపాదిస్తే సరిపోతుంది. రసాయన ఫైబర్ ఉత్పత్తిదారు అయిన హెంగ్లీ పెట్రోకెమికల్ (Hengli Petrochemical) కంపెనీకి హాంగ్‌వేయి సీఈఓ, ఛైర్మన్ గా వహిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ సంక్షోభం ఎలా పెరిగింది?

గతేడాది డిసెంబర్‌లో లిక్విడిటీ సమస్యల వల్ల చైనాకు చెందిన అత్యంత ఎవర్‌గ్రాండే తన అప్పులను తిరిగి చెల్లించలేక పోయింది. మరొకవైపు గృహ కొనుగోలుదారుల్లో అసహనం పెరిగిపోయింది నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే రుణాలను చెల్లించడాన్ని ఆపేస్తామని బెదిరించారు. ఆ విధంగా రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని పెంచుతుంది.

First published:

Tags: China, China App Ban, China Products, Real estate