ఈ పరికరం నుంచీ వచ్చే మ్యూజిక్ వింటే... భలే ఉందే అనిపించకమానదు...

Amazing Music Instrument : ప్రపంచంలో ఎన్నో రకాల మ్యూజిక్ పరికరాలున్నాయి. కొత్తకొత్తవి తయారుచేస్తూనే ఉన్నారు. వాటిలో ఈ పరికరం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

news18-telugu
Updated: March 15, 2020, 10:08 AM IST
ఈ పరికరం నుంచీ వచ్చే మ్యూజిక్ వింటే... భలే ఉందే అనిపించకమానదు...
ఈ పరికరం నుంచీ వచ్చే మ్యూజిక్ వింటే... భలే ఉందే అనిపించకమానదు... (credit - YT - Marc Chouarain)
  • Share this:
Amazing Music Instrument : మీరు మ్యూజిక్ లవర్స్ అయితే... తప్పకుండా మ్యూజీషియన్ మార్క్ చోరాయిన్ దగ్గరున్న "క్రిస్టల్ బాషెట్" చూసి తీరాల్సిందే. ఫిల్మ్ సౌండ్ ట్రాక్స్ కోసం ఆయన ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇది ఇప్పటిది కాదు. 1952లో బ్రదర్స్ అయిన బెర్నార్డ్, ఫ్రాంకోయిస్ బాషెట్... దీన్ని తయారుచేసారు. ఓ భారీ ప్లేట్‌కి మెటల్ రాడ్లను అమర్చారు. ప్రతీ మెటల్ రాడ్డుకీ ఓ గ్లాస్ రాడ్డు ఉంటుంది. సౌండ్ పిచ్ ఆధారంగా... మెటల్ రాడ్ల పొడవు, బరువు, పొజిషన్ ఆధారపడి ఉంది. గ్లాస్ రాడ్డుపై తడి చేతులతో టచ్ చేస్తే చాలు... ప్రత్యేక ధ్వనులు వస్తున్నాయి. 1952 నాటి పరికరంలో మరికొన్ని మార్పులు చేసి... సౌండ్ ట్రాక్స్ తయారుచేస్తున్నాడు మార్క్ చోరాయిన్. మరి ఆ ట్రాక్స్ మీరు కూడా వినండి...

Published by: Krishna Kumar N
First published: March 15, 2020, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading