మలేషియా ఎంహెచ్370 విమానం అదృశ్యం మిస్టరీ వీడనుందా...

Malaysia Airlines flight MH370 | ఇండోనేషియా సుమత్రా సముద్రంలో ఐదేళ్ల క్రితం విమానం కూలిపోవడం తన కళ్లారా చూసినట్లు ఓ మత్స్యకారుడు చెబుతున్నాడు. దీంతో దీని అదృశ్యం మిస్టరీ వీడవచ్చన్న ఆశలు మళ్లీ చిగురించాయి.

news18-telugu
Updated: January 17, 2019, 11:54 PM IST
మలేషియా ఎంహెచ్370 విమానం అదృశ్యం మిస్టరీ వీడనుందా...
ఐదేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం...
  • Share this:
మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్370 విమానం అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ విమానం సుమత్రా సముద్రంలో కూలిపోవడం తాను కళ్లారా చూసినట్లు ఇండోనేషియాకు చెందిన ఓ మత్స్యకారుడు చెబుతున్నాడు. అతను చెబుతున్న ఆధారాలతో ఆ విమానం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.  ఎంహెచ్370 విమాన అదృశ్యం అంతర్జాతీయ పౌరవిమానయాన చరిత్రలో మిస్టరీగా మిగిలిపోనుంది. ఐదేళ్ల క్రితం మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం అదృశ్యమయ్యింది. దాని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ విమానం ఆచూకీని గుర్తించలేకపోయింది. ఎంహెచ్370 విమానం ఏమైయ్యిందో సిట్ నిర్ధారించలేకపోయింది.

విమానంతో పాటు అందులోని 239 మంది ప్రయాణీకులు, విమాన సిబ్బంది అదృశ్యమయ్యారు. దీని ఆచూకీకి సంబంధించి ఇండోనేషియాకు చెందిన ఓ మత్స్యకారుడు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించాడు. విమానం సముద్రంలో కూలిపోవడానికి ముందు గాల్లో రెండుగా చీలిన గాలిపటంలా విడిపోయిందని చెబుతున్నారు. నల్లటి పొగలు చిమ్ముతూ సముద్రంలో కూలిపోయిందని మీడియా సమావేశంలో వివరించాడు. అయితే ఈ అంశంపై ఇన్ని రోజులు ఎందుకు ఆయన మీడియాతో మాట్లాడలేకపోయారన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయాడు.  ఆ సమయంలో తీవ్రమైన దుర్వాసన ఆ ప్రాంతంలో ఉన్నట్లు వివరించాడు. ఆ మత్స్యకారుడు ఇచ్చిన వివరాల ఆధారంగా కనిపించకుండా పోయిన విమానం కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఎంహెచ్370 విమానం ఏమైంది?
మలేషియన్ బోయింగ్ విమానం 2014 మార్చి 8న కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీజింగ్ వెళ్తూ అదృశ్యమయ్యింది. ఆ విమానంలో 227 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో అర్ధరాత్రి దాటిన తర్వాత 1.19 గంటలకు విమాన కెప్టెన్ ‘గుడ్ నైట్ మలేసియన్ 370’ అన్నది మాత్రమే రేడియో ట్రాన్స్‌మిషన్‌లో చివరగా రికార్డు అయ్యింది. విమానాన్ని మలేషియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నుంచి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు అప్పగిస్తున్న సమయంలో ఇది అదృశ్యమయ్యింది. రాడార్, శాటిలైట్ సందేశాలను విశ్లేషించడం ద్వారా ఇది నిర్దేశిత మార్గంలో వెళ్లకుండా తిరిగి మలేషియా వైపునకు వెనుదిరిగి, దక్షిణ హిందూ మహాసముద్రం వైపుగా పయనించినట్లు నిర్ధారించారు. ఇంధనం అయిపోవడంతో ఆస్ట్రేలియాకు పశ్చిమ ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఈ విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
Published by: Janardhan V
First published: January 17, 2019, 11:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading