ఇన్‌స్టాలో ఫోటోలన్నీ డెలీట్ చేస్తే ఏడాదంతా విమాన టిక్కెట్లు ఫ్రీ ఫ్రీ

మొత్తానికి జెట్‌బ్లూ విమానసంస్థ మార్కెటింగ్ వ్యూహం బాగానే వర్కౌట్ అయ్యింది. ఆ సంస్థ ప్రకటించిన ఈ వెరైటీ ఆఫర్‌కి ఉచిత ప్రచారం బాగానే లభించింది.

news18-telugu
Updated: March 2, 2019, 9:44 PM IST
ఇన్‌స్టాలో ఫోటోలన్నీ డెలీట్ చేస్తే ఏడాదంతా విమాన టిక్కెట్లు ఫ్రీ ఫ్రీ
ప్రతీకాత్మక చిత్రం(Photo:AFP)
  • Share this:
ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మూడు ఫోటోలైనా షేర్ చేయనిదే చాలా మంది నెటిజన్లకు రోజు గడవదు. యువకులు, పెద్దలు, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరిలోనూ ఇన్‌స్టా ఫీవర్ ఈ మధ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని తన ప్రచారం కోసం వాడుకునేందుకు అమెరికాకు చెందిన ఓ విమానయాన సంస్థ వెరైటీ ఛాలెంజ్ విసిరింది. ఎవరైనా తమ ఇన్‌స్టా‌లోని ఫోటోలన్నిటినీ డెలీట్ చేస్తే వారికి ఏడాదికాలం పాటు విమాన టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు జెట్‌బ్లూ అనే ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. దీనికి మరో కండీషన్ కూడా ఉంది. తమ ఇన్‌స్టా అకౌంట్‌ను పూర్తిగా క్లీన్ చేయడంతో పాటు జెట్‌బ్లూ ఫోటోను అప్‌లోడ్ చేసి @JetBlue కి ట్యాగ్ చేసి #allyoucanjetsweepstakes హ్యాష్‌ట్యాగ్ వాడాలి. జెట్‌బ్లూ ప్రకటించిన ఈ ఆఫర్ అమెరికాలో నివసిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ కంటెస్ట్‌ ఈ నెల 8 వరకు కొనసాగుతుంది.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

All You Can Jet means All You Can ____. How would you fill in the blank? Enter our #ALLYOUCANJETSWEEPSTAKES now at www.jetblue.com/aycj. #linkinbio


JetBlue (@jetblue) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


మొత్తానికి జెట్‌బ్లూ విమానసంస్థ మార్కెటింగ్ వ్యూహం బాగానే వర్కౌట్ అయ్యింది. ఆ సంస్థ ప్రకటించిన ఈ వెరైటీ ఆఫర్‌కి ఉచిత ప్రచారం బాగానే లభించింది. పలువురు ఇన్‌స్టా‌ ఖాతాదారులు ఛాలెంజ్‌ని స్వీకరించి, గతంలో తాము ఇన్‌స్టాలో షేర్ చేసిన అన్ని ఫోటోలను డెలీట్ చేశారు.

తమ ఇన్‌స్టా‌లోని ఫోటోలను తొలగించడం ఇష్టంలేని కొందరు ఖాతాదారులు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ కంటెస్ట్‌లో పాల్గొన్నారు. తమ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారికి ఆ సంస్థ ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు విమాన ప్రయాణ టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Published by: Janardhan V
First published: March 2, 2019, 9:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading