వామ్మో... అదేం కొట్టుడురా దేవుడా... ఐదేళ్ల చిన్నారి... డ్రమ్స్ ఇరగదీస్తోందిగా... వైరల్ వీడియో

Viral Video: ఆ వయసులో సాధారణంగా పిల్లలు ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ పాప మాత్రం ప్రొఫెషనల్ డ్రమ్మర్స్ రేంజ్‌లో దంచేస్తోంది. ఒక్కసారి వీడియో చూస్తే... మళ్లీ చూస్తారు.

news18-telugu
Updated: October 26, 2020, 2:25 PM IST
వామ్మో... అదేం కొట్టుడురా దేవుడా... ఐదేళ్ల చిన్నారి... డ్రమ్స్ ఇరగదీస్తోందిగా... వైరల్ వీడియో
వామ్మో.. అదేం కొట్టుడురా దేవుడా.. ఐదేళ్ల చిన్నారి.. డ్రమ్స్ ఇరగదీస్తోందిగా.. వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
మనకు ఓ నాలుగు డ్రమ్స్ ఇచ్చి.. రెండు స్టిక్స్ ఇస్తే... ఏదైనా పాటకు బీట్ కొట్టమంటే... మనం ట్రైచేస్తాం... కానీ ఇబ్బంది పడతాం. సరే... మనకు ఎలా కొట్టాలో కొంత ఐడియా ఉంటుంది కాబట్టి ఏదే మేనేం చేస్తాం. కానీ ఆ చిన్నారి వయసు అంతా కలిపి ఐదేళ్లు. ఇంకా ఊహే సరిగా తెలియదు. అలాంటిది చుట్టూ డ్రమ్స్ పెట్టుకొని... తెగ ఊగిపోతూ... స్టిక్స్‌ని టెక్నికల్‌గా తిప్పేస్తూ... ఓ రేంజ్‌లో ఇరగదీస్తోంది. అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా... అటూ ఇటూ మెరుపులా కదులుతూ... యమా స్పీడుతో కొట్టేస్తోంది. ఇంత చిన్నప్పుడే ఇలా కొడుతోందంటే... రేపు పెద్దయ్యాక... ఇంటర్నేషనల డ్రమ్మర్స్‌కే దిమ్మ తిరిగేలా చేస్తుందేమో అని మీకు ఈ వీడియో చూశాక అనిపిస్తే... అనిపించవచ్చు.

అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ ఛాప్‌మాన్... ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. నిమిషం వీడియోలో... ఈ చిట్టితల్లి... డ్రమ్స్ ముందు కూర్చుంది. వాయించేందుకు రెడీ అవుతూ... చేతులతో.. డ్రమ్ స్టిక్‌లను గిరగిరా తిప్పేసింది. అలా ఎలా తిప్పుతోంది... అని మనం అనుకునేలోపే... అప్పుడే ఏం చూశావ్... ఇప్పుడు చూడు... అంటూ... దుమ్మురేపేలా బీట్ కొట్టింది. సాంగ్ మధ్యలో గ్యాప్ వస్తే... ట్రిక్స్ ప్లే చేస్తూ మనం షాక్ అయ్యేలా చేస్తోంది. అలా వాయిస్తున్నప్పుడు ఆమె ఫేసులో ఆనందం చూడాలి... మామూలుగా లేదు. ప్రపంచాన్ని మర్చిపోయి వాయించేస్తోందంతే.


ఇది చూసి నమ్మలేకపోతున్నాను అని రెస్క్ కాప్షన్ పెట్టాడంటే... ఆ చిన్నారి ఎంత బాగా చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రేంజ్‌లో ఉతికారేస్తుంటే... ఈ వీడియో వైరల్ అవ్వక ఏమవుతుంది. సూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 8.43లక్షల మంది చూశారు. ఒక్కరోజులోనే వచ్చిన వ్యూస్ ఇవి. 22 వేలకు పైగా లైక్స్, 5వేలకు పైగా షేరింగ్స్, 746 కామెంట్లు... చూసేవాళ్ళు... వామ్మో భలేభలే అంటున్నారు.


పిల్లలకు ఇవ్వాల్సింది బొమ్మలు కాదు... ఇలాంటివే... నిజమైనవి... అలా చేస్తే... వాళ్లు అద్భుతాలు చేసి చూపిస్తారు అని ఓ యూజర కామెంట్ రాశారు. పిల్లలకు ఎంతో టాలెంట్ ఉంటుంది... ఈ చిన్నారికి ఇది బాగా నచ్చింది అని మరొకరు కామెంట్ రాశారు. ఆగస్టులో కూడా ఇలాగే ఆరేళ్ల చిన్నారి... స్టిక్స్ తో... పాలరాయిపై డ్రమ్మింగ్ చేశాడు. అది కూడా వైరల్ అయ్యింది.
Published by: Krishna Kumar N
First published: October 26, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading