HOME »NEWS »INTERNATIONAL »this 14 year old girl won a 25000 dollar prize for a discovery that could lead to a cure for covid 19 nk

Covid Vaccine: 14 ఏళ్ల ఎన్నారై బాలికకు రూ.18 లక్షల ప్రైజ్ మనీ... కరోనాకి చెక్ పెట్టేసింది

Covid Vaccine: 14 ఏళ్ల ఎన్నారై బాలికకు రూ.18 లక్షల ప్రైజ్ మనీ... కరోనాకి చెక్ పెట్టేసింది
14 ఏళ్ల ఎన్నారై బాలిక అనికాకు రూ.18 లక్షల ప్రైజ్ మనీ... కరోనాకి చెక్ పెట్టేసింది

Covid 19 Treatment: కరోనాకి చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో తన పరిశోధనతో ఆ బాలిక ప్రత్యేకంగా నిలుస్తోంది.

  • Share this:
    అమెరికా... టెక్సాస్ లోని ఫ్రిస్కోలో నివసిస్తున్న 14 ఏళ్ల అనికా చేబ్రోలు... 2020 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ గెలిచి... రూ.18 లక్షలకు పైగా ప్రైజ్ మనీ గెలుచుకుంది. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడే శక్తిమంతమైన థెరపీని ఆమె కనిపెట్టింది. ఇందుకోసం ఆమె ఇన్-సిలికో మెథడ్ ఉపయోగించింది. కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే కొవ్వును కట్టడి చేసే ప్రధాన మాలిక్యూల్ ను ఆమె కనిపెట్టింది. "రెండ్రోజులుగా నా ప్రాజెక్టు గురించి మీడియాలో చాలా ఎక్కువగా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే అది కరోనాతో లింక్ అయి ఉంది. అందరిలాగే నేను కూడా కరోనా రోజులు పోయి... సాధారణ రోజులు రావాలని కోరుకుంటున్నాను" అని CNNకి అనికా తెలిపింది.

    కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికి పైగా వ్యాపించింది. 11లక్షల మందికి పైగా చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 2.19లక్షల మంది చనిపోయారు. 8వ తరగతి చదువుతున్న ఇండియన్ అమెరికన్ అయిన అనికా... తన ప్రాజెక్టును సమర్పించింది. కానీ దాన్ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ గుర్తించారు. నిజానికి అనికా అంత తేలిగ్గా తన ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇందుకోసం ఆమె రకరకాల వైరస్ లు, వ్యాధులను అధ్యయనం చేసింది. ఏయే వ్యాధులపై, ఏ మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంది. తన అధ్యాపకుల సాయంతో... కరోనా అంతు చూడాలంటే... ఎలాంటి పరిశోధన చేయాలో గ్రహించి... ఆ దిశగా ప్రయత్నించి, విజయం సాధించింది.



    "అనికా చురుకైన అమ్మాయి. కరోనా వ్యాక్సిన్ పై ఎన్నో ప్రశ్నలు వేయడం ద్వారా ఇది సాధించింది. ఆమెకు ఎంతో ఆసక్తి ఉంది" అని ఈ ప్రైజ్ మనీ ఛాలెంజ్ కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ తెలిపారు. ఇప్పుడు ఆమె పరిశోధన వల్ల ఈ ప్రపంచానికి మేలు కలగనుంది అని వివరించారు.

    ఇప్పుడు అనికా టాప్ యంగ్ సైంటిస్ట్ గుర్తింపు పొందింది. కానీ ఆమె లక్ష్యం ఇంకా పెద్దదే. మనిషిని చావు నుంచి కాపాడే అంశంపై ప్రపంచ సైంటిస్టులతో కలిసి పనిచేయాలనుకుంటుంది. "నేను వేసవిలో కనిపెట్టినది... ప్రపంచ పరిశోధనలతో పోల్చితే... సముద్రంలో నీటి బొట్టంతే... ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను కనిపెట్టిన మాలిక్యూల్... కరోనా వైరస్ ని ఎలా చంపుతుందో... ఎలా డ్రగ్ తయారవుతుందో ప్రపంచ సైంటిస్టులతో కలిసి... పనిచేయాల్సి ఉంది " అని ఆమె తెలిపింది.

    భరతనాట్యం చేస్తున్న అనికా చేబ్రోలు


    ప్రస్తుతం అనికా ఓ 14 ఏళ్ల సాధారణ యువతిలా పని చేసుకుపోతోంది. తనకు ఇష్టమైన భరతనాట్యాన్ని నేర్చుకుంది. ఎనిమిదేళ్లపాటూ ఇష్టపడి దీన్ని నేరుకుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... ఆమె ఏదైనా అనుకుంటే... దాన్ని సాధించేదాకా వదలదని. ఆమె ఎన్నారై కావడం మనకో మంచి విషయం. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
    Published by:Krishna Kumar N
    First published:October 19, 2020, 08:03 IST

    टॉप स्टोरीज