ఇళ్ళు, మరుగు దొడ్లు అన్నీ వజ్రాలతో కట్టినవే..డైమండ్ విలేజ్ విశేషాలు..

అగ్నిపర్వతం బద్ధలవ్వడం వల్లే స్యేవైట్ రాళ్లు ఏర్పడ్డాయని మొదట్లో భావించేవారు. కానీ 1960 తర్వాత అసలు వాస్తవం బయటపడింది. ఆస్టరాయిడ్ ఢీకొనడం వల్లే సూక్ష్మవజ్రాలతో కూడిన రాళ్లు ఏర్పడ్డాయని పరిశోధనలో తేలింది.

news18-telugu
Updated: August 22, 2019, 10:00 PM IST
ఇళ్ళు, మరుగు దొడ్లు అన్నీ వజ్రాలతో కట్టినవే..డైమండ్ విలేజ్ విశేషాలు..
నార్డ్‌లింగెన్ (Image:Wikimedia)
  • Share this:
అదో చిన్న పట్టణం..! కనీసం 20 వేల మంది కూడా లేని ఆ ఊర్లో..ఎక్కడ చూసినా వజ్రాలే..! దేన్ని ముట్టుకున్నా అది వజ్రమే..! ఇళ్లు, ఆఫీసులు చివరకు మరుగుదొడ్లు కూడా వజ్రాలతోనే కట్టారు. ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ఊరంతా వజ్రాలతో నిండి ఉంది. ఒక్కటి కాదు..రెండు కాదు.. ఏకంగా 72వేల టన్నుల డైమండ్స్ ఉన్నాయి. నార్డ్‌లింగెన్..! జర్ననీలోని బవేరియా ప్రావిన్స్‌లో ఉన్న ఈ పట్టణం టూరిస్టులకు స్వర్గధామం. వజ్రపు కాంతుల్లో ఇంధ్రభవనాల్లా మెరిసే..నార్డ్‌లింగెన్‌ను చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

కొన్ని లక్షల ఏళ్ల క్రితం అనంత విశ్వం నుంచి ఓ భారీ ఆస్టరాయిడ్ దూసుకొచ్చింది. 3 బిలియన్ టన్నుల బరువున్న ఆస్టరాయిడ్..గంటకు 15 మైళ్ల వేగంతో భూగోళాన్ని ఢీకొట్టింది. ఆ ఆస్టరాయిడ్ ఢీకొట్టిన ప్రాంతమే ఈ నార్డ్‌లింగెన్ పట్టణం..! అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడితో ఢీకొట్టడం..ఆ తర్వాత నెలకొన్న వాతావరణ మార్పుల కారణంగా..ఆ ప్రాంతంలో స్యేవైట్ అనే రాళ్లు ఏర్పడ్డాయి. గాజు, స్పటికం, వజ్రాలతో స్యేవైట్ అనే రాయి ఏర్పడుతుంది. అంటే ఈ లెక్కన నార్డ్‌లింగెన్‌లోని భూమి నిండా వజ్రాలే ఉన్నాయి.

క్రీస్తుశకం 898 తర్వాత ఈ ప్రాంతంలో జనావాసాల ఏర్పాటు ప్రారంభమైంది. అక్కడ మట్టితోనే ఇళ్లు నిర్మించుకున్నారు. అంటే అందులో ఉన్న వజ్రాలతోనే వాటిని కట్టుకున్నారన్న మాట. ఐతే ఆ వజ్రాలు కంటికి కనిపించవు. 0.2 మిల్లీమీటర్ కంటే ఎక్కువ సైజులో ఉండవు. ఎండ పడినప్పుడు..చాలా జాగ్రత్తగా చూస్తేనే మెరుస్తూ కనిపిస్తాయి. ఇలా నార్డ్‌లింగెన్‌లో ఇళ్లు, చర్చిల నిండా సూక్ష్మ వజ్రాలు పొదిగి ఉన్నాయి.


అగ్నిపర్వతం బద్ధలవ్వడం వల్లే స్యేవైట్ రాళ్లు ఏర్పడ్డాయని మొదట్లో భావించేవారు. కానీ 1960 తర్వాత అసలు వాస్తవం బయటపడింది. ఆస్టరాయిడ్ ఢీకొనడం వల్లే సూక్ష్మవజ్రాలతో కూడిన రాళ్లు ఏర్పడ్డాయని పరిశోధనలో తేలింది. అవన్నీ 5వేల కేరట్ల స్వచ్ఛమైన వజ్రాలుగా చెప్పుకుంటారు. ఇలా ఊరి నిండా వజ్రాలున్నా.. వాటి కోసం ఎప్పుడూ దొంగలు పడలేదు. ఇళ్లు ముందు సెక్యూరిటీ కూడా కనిపించదు. ఎంతో చరిత్ర..అంతమించిన ప్రకృతి సౌందర్యం కారణంగా.. నార్డ్‌లింగెన్‌ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారింది. లక్షలాది మంది పర్యాటకులు డైమండ్ టౌన్‌‌ను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వెళ్తుంటారు.
First published: August 22, 2019, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading