Home /News /international /

THE VERY SLOW MOVIE PLAYER THAT SHOWS A FILM OVER AN ENTIRE YEAR WITHOUT REPEAT NK

వెరీ స్లో మూవీ ప్లేయర్... ఒక్క సినిమా పూర్తిగా ప్లే అవ్వడానికి సంవత్సరం పడుతుంది

వెరీ స్లో మూవీ ప్లేయర్ (Image : Twitter)

వెరీ స్లో మూవీ ప్లేయర్ (Image : Twitter)

The Very Slow Movie Player : సాధారణ ప్లేయర్లలో ఒక సెకండ్‌కి 24 ఫ్రేములు ప్లే అవుతాయి. వెరీ స్లో మూవీ ప్లేయర్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ ఫ్రేమ్ మారుతుంది. అందువల్ల 24 ఫ్రేములు ప్లే అయ్యేటప్పటికి గంట పడుతుంది.

మన దగ్గరున్న మూవీ ప్లేయర్లలో సినిమా స్లో ప్లే అవ్వడానికి ఎంత టైం పడుతుంది. మహా అయితే ఓ రోజంతా ఓ సినిమా ప్లే అవుతుందేమో. అంతకు మించి స్లోగా ప్లే అయ్యే మూవీ ప్లేయర్లు ఇప్పుడెక్కడున్నాయి. కానీ ఆ మూవీ ప్లేయర్ మాత్రం ప్రత్యేకమైనది. అందులో రెండున్నర గంటల సినిమా ప్లే కొడితే... అది పూర్తవడానికి సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అది సినిమాలోని ప్రతీ సెకండ్‌నీ విడివిడిగా చూపిస్తుంది. గంటకు ఓ సెకండ్ చొప్పున ప్లే అవుతుంది. అందుకే దానికి వెరీ స్లో మూవీ ప్లేయర్ అని పేరు పెట్టారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

అసలు ఇలాంటి మూవీ ప్లేయర్ వల్ల మనకు ఉపయోగం ఏమిటన్న డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ప్రయోజనం ఉంది. ఈ మూవీ ప్లేయర్‌ని ఏ గోడకో తగిలించి. అందులో ఓ సినిమా ప్లే చేస్తే... అది గంటకో సెకండ్ చూపిస్తూ ఉండటం వల్ల... ప్రతీ దృశ్యం. కలర్ ఫుల్ వాల్ పేపర్ లాగా లేదంటే పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. గంటగంటకూ సీన్ మారిపోతూ ఉండటం వల్ల మనకు ఎప్పుడూ ఒకేలా కనిపించదు. అందువల్ల అది ఉన్న ఏరియా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది.

‌డిజైనర్ అండ్ ఇంజినీర్ బ్రియాన్ బోయర్ (Bryan Boyer) సృష్టి ఇది. ఈ మూవీ ప్లేయర్‌లో సినిమా ఎంతవరకూ ప్లే అయ్యిందో డ్యూరేషన్ చూపించదు. సపోజ్ ఓ నెల తర్వాత సినిమా ఎక్కడి వరకూ ప్లే అయ్యిందో తెలుసుకుందామంటే తెలియదు. అసలా ఆప్షన్ ఇందులో లేదు. అలా ఎందుకు తయారుచేశారంటే... టైంతో సంబంధం లేకుండా దీన్ని చూడాలన్నది బోయర్ ఆలోచనట.

సాధారణ ప్లేయర్లలో ఒక సెకండ్‌కి 24 ఫ్రేములు ప్లే అవుతాయి. వెరీ స్లో మూవీ ప్లేయర్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ ఫ్రేమ్ మారుతుంది. అందువల్ల 24 ఫ్రేములు ప్లే అయ్యేటప్పటికి గంట పడుతుంది. అంటే ఇది నార్మల్ ప్లేయర్ల కంటే 3,600 రెట్లు స్లోగా ప్లే అయ్యే ప్లేయర్ అన్నమాట. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.

 

ఇవి కూడా చదవండి :


యాపిల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు... చకచకా...


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?


మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

First published:

Tags: Business Ideas, BUSINESS NEWS, Information Technology, Technology, World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు