జపాన్‌లో చేతులు మారబోతున్న పాలన... కొత్త ప్రధానికి సవాళ్ల స్వాగతం

కరోనా వైరస్ వచ్చాక జపాన్‌ అభివృద్ధి పాతాళానికి పడిపోయింది. ఇలాంటి సమయంలో రాబోతున్న కొత్త ప్రధానిపై ఎన్నో సవాళ్లున్నాయి. మరి ప్రధాని రేసులో ఉన్నదెవరు?

news18-telugu
Updated: September 14, 2020, 12:41 PM IST
జపాన్‌లో చేతులు మారబోతున్న పాలన... కొత్త ప్రధానికి సవాళ్ల స్వాగతం
జపాన్‌లో చేతులు మారబోతున్న పాలన... కొన్న ప్రధానికి సవాళ్ల స్వాగతం (credit - reuters)
  • Share this:
షింజో అబే జపాన్ ప్రధానమంత్రిగా ఎంతో గుర్తింపు పొందారు. ప్రపంచ దేశాలతో సంబంధాలు, చైనాతో జగడం, అభివృద్ధి చెందుతున్న దేశాలతో చెలిమి వంటివి షింజోను ప్రత్యేకమైన నేతగా నిలబెట్టాయి. ఇలాంటి ఎన్నో ఘనతలు ఇప్పడు ఆయన వారసుడి ఎంపికకు అడ్డుగోడగా మారాయి. షింజో తర్వాత ఆ సింహాసనంపై యోషిహిదే సుగా కూర్చునే అవకాశం కనిపిస్తోంది. కొలిటిస్కు అనారోగ్య సమస్యల కారణంగా తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గత నెలలో షింజో అబే ప్రకటించారు. ఇది నయం చేయలేని ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి. ఇన్నాళ్లూ దీన్ని తట్టుకుంటూనే ప్రధానిగా బాధ్యతలు కొనసాగించారాయన. జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) ఇవాళ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటుంది. జపాన్‌లో అధ్యక్ష వ్యవస్థ లేదు. ప్రధానిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. ఇప్పటికే అధికారంలో ఉండటంతో నెక్ట్స్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే వ్యక్తికి పీఠం సులువుగా దక్కనుంది.

మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా, మాజీ రక్షణ మంత్రి షిగేరు ఇషిబా కూడా ప్రధాని రేసులో ఉన్నారు. ఒకవేళ సుగానే ఎంపీలు ఎంచుకుంటే... ఇది 72 ఏళ్ల సుగాకు మర్చిపోలేని గిఫ్ట్ అనుకోవచ్చు. ఆయన రాజకీయ జీవితానికి ఇది ఆఖరి మెట్టు కానుంది. షింజో అబే... 2012లో ప్రధాని అయినప్పటినుంచి సుగాతో కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపు దశాబ్దం పాటు వీరు కలిసి పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి... దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన నాయకుడిగా అబే నిలిచారు.

సుగా తన పొలిటికల్ కెరీర్ మొత్తం అబేకు అనుచరుడిగానే ఉన్నారు. ప్రధాన మంత్రి క్యాబినెట్ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఈ పదవి చీఫ్ ఆఫ్ స్టాఫ్, ప్రెస్ సెక్రటరీ... రెండింటి కలయికతో సమానం. వీరిద్దరి శైలి కూడా ఒకేలా ఉండేది. అబే జపాన్ రాజకీయ రాజవంశాల నుంచి వచ్చారు. ఆయన కుటుంబం దేశ రాజకీయ వ్యవస్థలో ప్రముఖమైనది. ఆ వంశవృక్షాన్ని అబే కొనసాగించాడు. ఆయన తండ్రి విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆయన కుటుంబం, బుధువర్గంలో ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఉండటం విశేషం.

సుగా మాత్రం భిన్నమైన కుటుంబం నుంచి వచ్చారు. ఆయనది రైతు కుటుంబం. రాజకీయాల్లో ఆయనది ఆచరణాత్మక శైలి. జపాన్ ప్రజలు ఆయన్ను తెరవెనుక డీల్ మేకర్‌గా పిలుస్తారు. ఆయనది అకితా ప్రిఫెక్చర్ అనే గ్రామం. పాఠశాల విద్య తర్వాత టోక్యోకు వెళ్ళారు. యూనివర్శిటీలో చదువుతూ డబ్బు కోసం చిన్న చిన్న పనులు చేశారు. ఓ కార్డు బోర్డు కర్మాగారంలో, సుకిజీ చేపల మార్కెట్లో పనిచేశారు. ఎన్నో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సుగా రాజకీయాల్లో ప్రవేశించారు.

ముందు యోకోహామాలోని సిటీ కౌన్సిల్‌కు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు పెద్దగా రాజకీయ సంబంధాలు, అనుభవం లేకపోయినప్పటికీ కష్టపడి పనిచేశారు. ఇంటింటి ప్రచారం చేశారు. రోజుకు 300 ఇళ్ల చొప్పున మొత్తం 30,000 ఇళ్లను సందర్శించారు. ఎన్నికలు ముగిసేనాటికి ఆయన ఆరు జతల బూట్లు మార్చాల్సి వచ్చిందట. అంతలా ఆయన తిరిగాడని ఎల్డీపీ చెబుతోంది.

ఈ రోజు ఆయన ఒక విజయవంతమైన పొలిటికల్ ఆపరేటర్‌గా నిలిచారు. అనుకున్న పని పూర్తి చేసేవరకూ వదిలేవారు కాదు. ఇలాంటి గుణాలే ఆయన్ను అబేకు దగ్గర చేశాయి. స్తబ్దుగా ఉన్న జపాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన ద్రవ్య ఉద్దీపనలు, నిర్మాణాత్మక సంస్కరణల కలయిక అని పిలిచే "అబెనోమిక్స్" ఆర్థిక విధానాల రూపకర్తగా, వాటి అమల్లో మార్గదర్శకుడిగా సుగా నిలిచారు. ప్రధానమంత్రిగా ఆయన ఒక్కడే "అబే ప్రత్యామ్నాయం" అని ప్రజలు భావిస్తున్నారని హక్కైడో విశ్వవిద్యాలయంలో వైస్ డీన్, అంతర్జాతీయ రాజకీయాల ప్రొఫెసర్ కజుటో సుజుకి అన్నారు. జపాన్ అతిపెద్ద వార్తాపత్రికలలో ఒకటైన మెయినిచి చేసిన ఒక సర్వేలో... అబే రాజీనామాకు ముందు 58.4% మంది ప్రజలు మహమ్మారిని కంట్రోల్ చేయడంలో సంతృప్తి చెందలేదని తేలింది. ఆయన్ని ఆమోదించే రేటింగ్ 36% కి పడిపోయింది. ఇది 2012 నుంచి ఇదే కనిష్ట స్థాయి.

జపాన్ రాజకీయాల నిపుణుడైన బ్రాడ్ గ్లోస్సెర్మాన్ మాట్లాడుతూ.. "అబే లైన్ నుంచి ఎల్డీపీ నుంచి ఇంకా బయటకు రాని వ్యక్తి సుగా. ఆయన చాలా స్వయం నిర్మిత వ్యక్తి. కానీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఇది ఎంతమేరకు పనికొస్తుందో చెప్పలేం" అని చెప్పారు.

భారీ ప్రభుత్వ రుణం, పెరుగుతున్న వృద్ధాప్య జనాభా వంటివి ప్రస్తుతం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కార్యాలయాల్లో లింగ సమానత్వం కోసం సంస్కరణల రూపకల్పనకు అబే బహిరంగంగా పిలుపునిచ్చినప్పటికీ, ఆయన దేశంలో నెలకొన్న లింగ అంతరాన్ని పరిష్కరించలేకపోయాడని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. సుగా ప్రధానిగా ఎన్నికైతే ఆయనకు సమీప భవిష్యత్తులో సవాళ్లు ఎదురుకానున్నాయి.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading