Home /News /international /

THE UNITED STATES CLOSED ITS AIRSPACE TO RUSSIAN PLANES AS THE RUSSIA ATTACKS UKRAINE SK

US-Russia: రష్యాకు బిగ్ షాక్.. అమెరికా సంచలన నిర్ణయం.. పుతిన్‌కు చుక్కలే..

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

జో బైడెన్-పుతిన్(ఫైల్ ఫొటో)

US-Russia War: రష్యా దూకుడు మాత్రం కొనసాగుతోంది. చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతూనే ఉంది. ముఖ్యంగా రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాలపై క్షిపణులతో దాడి చేస్తోంది

    ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం(Ukraine-Russia War)పై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. యుద్ధాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ నగరాలపై బాంబుల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా, ఈయూ సహా పలుదేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే అమెరికా సేనలు (US Forces) నేరుగా యుద్ధం చేయవదని స్పష్టం చేశారు. కానీ రష్యాను ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తామని.. పుతిన్ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

    Crude Oil Price: భారీగా పెరిగిన ముడి చమురు ధరలు.. ఇక నుంచి పెట్రోల్ రేట్ల మోత..!

    ''పుతిన్ నియంత. యుద్ధ రంగంలో పుతిన్ (Putin) లాభపడొచ్చు. కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఉక్రెయిన్ ప్రజలతో అమెరికా ఉంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో చుట్టుముట్టొచ్చు. కానీ ఉక్రెయిన్ ప్రజల హృదయాలను ఆయన ఎప్పటికీ గెలవలేరు. రష్యా బలగాలతో అమెరికా సైన్యం తలపడదు. కానీ పుతిన్ పశ్చిమ వైపునకు కదిలితే మాత్రం నాటో దేశాలకు అమెరికా అండగా ఉంటుంది. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లితువేనియా దేశాల్లో మా బలగాను మోహరించాం. రష్యా ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే తిప్పకొడతాం. '' అని బైడెన్ పేర్కొన్నారు.


    అమెరికాతో పాటు చాలా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన కంపెనీలన్నీ రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. రష్యా ఎయిర్‌లైన్స్‌కు సహాయ సహకారాలు నిలిపివేస్తున్నట్లు బోయింగ్ ప్రకటించింది. రష్యాలో ఐఫోన్ల అమ్మకాలను నిలిపివేసినట్లు యాపిల్ సంస్థ కూడా ప్రకటన విడుదల చేసింది. గత వారం నుంచే ఎగుమతలను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈయూ దేశాలన్నీ రష్యా విమానాలపై నిషేధం విధించాయి. తమ దేశాల గగనతలం మీదుగా రష్యా విమానాలు ప్రయాణించేందుకు వీల్లేదని స్పష్టం చేశాయి. తమ పోర్టుల్లో రష్యన్ నౌకలపై కూడా నిషేధం విధించినట్లు తెలిపాయి.

    Russia-Ukraine War :రహస్య అండర్ గ్రౌండ్ బంకర్ లోకి పుతిన్ ఫ్యామిలీ..అణుయుద్ధం జరిగి

    మరోవైపు రష్యా దూకుడు మాత్రం కొనసాగుతోంది. చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడుతూనే ఉంది. ముఖ్యంగా రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాలపై క్షిపణులతో దాడి చేస్తోంది. ఉక్రెయిన్ రాజధానికి రష్యన్ బలగాలు క్యూకట్టాయి. దాదాపు 40 మైళ్ల పొడవైన రష్యన్ సైనిక వాహనాల శ్రేణి కీవ్ నగరానికి చేరవవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


    ఉక్రెయిన్‌లో తమ లక్ష్యం నెరవేరే వరకు సైనిక చర్యను విరమించేది లేదని.. అప్పటి వరకు యుద్ధం కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. ఐతే మొన్నటి వరకు సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్న రష్యా బలగాలు.. ఇప్పుడు జనావాసాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. క్షిపణులతో దాడులు చేయడంతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారు. నిన్న ఖర్కీవ్‌లో భారత విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Joe Biden, Russia, Russia-Ukraine War, Ukraine, Us news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు