హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Omicron cases: ఒక్కరోజే 10 వేలు దాటిన ఒమిక్రాన్​ కేసులు.. ఇక ఆ దేశంలో అల్లకల్లోలమేనా? ఆందోళన కలిగిస్తోందంటున్న ఆరోగ్యశాఖ మంత్రి.. 

Omicron cases: ఒక్కరోజే 10 వేలు దాటిన ఒమిక్రాన్​ కేసులు.. ఇక ఆ దేశంలో అల్లకల్లోలమేనా? ఆందోళన కలిగిస్తోందంటున్న ఆరోగ్యశాఖ మంత్రి.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒమిక్రాన్​ ప్రపంచంలో మరో కొత్త భయాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే డెల్టా రకం కరోనాతో అల్లకల్లోలమైన ప్రపంచ దేశాలకు ఒమిక్రాన్​ చుక్కలు చూపిస్తోంది. తాజాగా ఒకే రోజు 10 వేలకు కేసులు పైబడి రావడం ఆందోళన కలిగించేదే..

దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. గతంలో వచ్చిన అన్ని కరోనా వైరస్​ల కంటే సెకండ్​ వేవ్​లో భారత్​లో అల్లకల్లోలం సృష్టించిన డెల్టా రకం (delta variant) అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron)​ వైరస్​పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్​ వేరియంట్​ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒమిక్రాన్‌ ధాటికి బ్రిటన్‌ చిగురుటాకులా వణికిపోతోంది. రోజువారీ కేసులతో పోలిస్తే.. ఆదివారం కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు రేట్లు పెరిగింది. గత 24 గంటల్లో 90వేల కరోనా కేసులు బయటపడగా.. అందులో 10వేల కేసులు ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉండటం ఆందోళన రేపుతోంది.

ఏడుకు చేరుకున్న మరణాలు..

ఒమిక్రాన్‌తో తొలి మరణం చోటు చేసుకున్న బ్రిటన్‌ (Britain) లో.. ప్రస్తుతం మరణాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ  (UK Department of Health) వెల్లడించింది. బ్రిటన్‌లో శుక్రవారం 3,201 ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases) నమోదు కాగా.. మరుసటి రోజు ఈ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఒక్కరోజే 10,059 కొత్త వేరియంట్‌ కేసులు..

శనివారం ఒక్కరోజే 10,059 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్​ కేసులు (Omicron cases) నమోదయ్యాయని తెలఅిపింది. దీంతో బ్రిటన్లో మొత్తం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల (Omicron variant cases) సంఖ్య 24,968కి పెరిగినట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ (UK Health Security Agency) ఆదివారం తెలిపింది. కాగా.. ఒమిక్రాన్‌ తీవ్రతతోపాటు.. సాధారణ కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ఎప్పటికప్పుడు సంప్రదింపులు..

బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ (Sajid Javid, Minister of Health of the United Kingdom) మాట్లాడుతూ..  గత 24 గంటల్లోనే 90,418 కేసులు (corona cases) నమోదుకావడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో.. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని  తెలిపారు. కేసుల (omicron cases) నియంత్రణకు శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామంటూ సాజిద్‌ చెప్పారు. వారిచ్చే సమాచారం తరువాత కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించాలా..? లేక మరికొన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఆయన వెల్లడించారు.

క్రిస్మస్‌కు ఐదు రోజులే..

గతేడాది కొవిడ్‌ విజృంభణ సమయంలో ఆసుపత్రిలో చేరికలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్లు సాజిద్‌ జావిద్‌ వెల్లడించారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్‌ అవసరమయ్యే కేసుల సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొన్నారు. అయితే.. క్రిస్మస్‌కు ఐదు రోజులే సమయం ఉండటంతో.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సాజిద్‌ జావిద్‌ హెచ్చరించారు.

First published:

Tags: Britain, Corona cases, Omicron