బతికున్న తల్లిని సమాధి చేసిన కొడుకు.. మూడు రోజులు ప్రాణాలతోనే..

మూడు రోజులుగా సమాధిలోనే ఉంటున్నప్పటికీ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సాయం కోసం బతిమాలడం విన్పించింది. వెంటనే పోలీసులు అక్కడ తవ్వి వాంగ్‌ను బయటకు తీసి రక్షించారు.

news18-telugu
Updated: May 8, 2020, 3:43 PM IST
బతికున్న తల్లిని సమాధి చేసిన కొడుకు.. మూడు రోజులు ప్రాణాలతోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవత్వం మంటగలిసింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఓ కొడుకు బతికుండగానే సమాధి చేశాడు. మూడు రోజుల తర్వాత స్థానికులు బయటకు తీసి రక్షించారు. ఈ ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన యాన్ తల్లి వాంగ్ కొద్దిపాటి పక్షవాతంతో బాధపడుతోంది. ఈ క్రమంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని భారంగా భావించాడు. తల్లికి సపర్యలు చేస్తూ సంరక్షణ చూసుకోలేకపోయాడు. దీంతో యాన్ ఏలాగైనా తన తల్లిని చంపాలని భావించాడు. అందులో భాగంగానే మే 2న చక్రాల బండిలో ఆమెను బయటకు తీసుకెళ్లాడు. మూడు రోజులు గడుస్తున్నా.. ఆమె ఇంటికి రాకపోవడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని భార్య పోలీసులకు చెప్పింది. వెంటనే యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తల్లికి సపర్యలు చేయడం తన వల్ల కాదని అందుకే ఆమెను ప్రాణాలతో పాతిపెట్టానని చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే పాతిపెట్టిన స్థలానికి వెళ్లాడు. మూడు రోజులుగా సమాధిలోనే ఉంటున్నప్పటికీ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సాయం కోసం బతిమాలడం విన్పించింది. వెంటనే పోలీసులు అక్కడ తవ్వి వాంగ్‌ను బయటకు తీసి రక్షించారు. మట్టికొట్టుకుపోయిన శరీరంతో కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: May 8, 2020, 3:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading