కరోనా (Corona) నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలో (In lockdown Time)... ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం కావడంతో... జననాల రేటు (Birth rate in Corona pandemic) పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికా (America)లో... పరిణామాలు ఇందుకు విరుద్ధంగా చోటుచేసుకున్నాయి. వాస్తవానికి అమెరికాలో కరోనా నేపధ్యంలో 2020 లో జననాల రేటు తగ్గింది (The rate of births has decreased.). ముందటేడు (2019) అమెరికా మొత్తం మీద 37.5 లక్షల జననాలు నమోదు కాగా, నిరుడు (2020) ఆ సంఖ్య అనూహ్యంగా పడిపోవడం విశేషం. గతంతో పోలిస్తే 4 శాతం తగ్గిపోయింది.
జూలై 2020 నుంచి జూలై 2021 వరకు..
యూఎస్ సెన్సస్ బ్యూరో (US Census Bureau) మంగళవారం విడుదల చేసిన గణాంకాల US జనాభాలో కేవలం 0.1 శాతం మాత్రమే వృద్ధి చెంది, 3,92,665 మంది మాత్రమే యూఎస్‌లో కొత్తగా నమోదయ్యారు. ఈ సంఖ్యలో యూఎస్‌కు వలస వచ్చిన వారితో పాటు, అక్కడే జన్మించిన వారూ (Birth rate in Corona pandemic) ఉన్నారు. జూలై 2020 నుంచి జూలై 2021 వరకు ఈ గణాంకాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కేవలం 148,000 మంది మాత్రమే..
మొట్టమొదటి సారిగా యూఎస్ (US)లో గణాంకాలు జననాల కన్నా వలసల రూపంలో (In the form of immigration) ఎక్కువగా కనిపించాయి. మొత్తంగా ఇతర దేశాల నుంచి అమెరికాకు 245,000 మంది వచ్చారు (residents from international migration). కేవలం 148,000 మంది మాత్రమే యూఎస్‌లో జననాలుగా (Birth rate in Corona pandemic) నమోదయ్యాయి.\
శ్వేతజాతీయులు తగ్గిపోయారు..
అమెరికాలో తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. గత నాలుగు సంవత్సరాలుగా నల్లజాతీయులతో పోలిస్తే వీరి జనాభా గణనీయంగా తగ్గింది. శ్వేతజాతి ప్రజలు ఆలస్యంగా వివాహాలు (late marriages) చేసుకోవడం, తక్కువ మంది పిల్లలను కనడంతో ఈ ధోరణి కనిపిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సెన్సెస్ డేటా (Census data) ప్రకారం, 2016 - 2020 సంవత్సరాల్లో తెల్లజాతీయుల జనాభా 1 మిలియన్ (10 లక్షల)కు పైగా తగ్గింది. 2010 నుంచి 2016 వరకు వీరి జనాభా పెరుగుదల స్తంభించి (Population growth freezes), తగ్గుదల ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో జనాభా వేగంగా పడిపోయింది.
పది లక్షల మంది శ్వేతజాతీయులు తగ్గిపోయారు
2016 నుంచి 2017 మధ్య కాలంలో1,29,000 మంది, 2019 నుంచి 2020 వరకు 4,82,000 మంది తెల్లజాతీయుల జనాభా (White population) తగ్గింది. ఫలితంగా 2010–2020 దశాబ్దంలో దాదాపు పది లక్షల మంది శ్వేతజాతీయులు తగ్గిపోయారు. ఈ లెక్కన 2010 జులై నుంచి 2020 జులై మధ్య కాలంలో వీరి జనాభా 63.8 శాతం నుంచి 59.7 శాతానికి పడిపోయింది. అమెరికాలో తెల్లజాతీయుల జనాభా ఇంత వేగంగా పడిపోవడం ఇదే తొలిసారి. అందువల్ల 2010 దశాబ్దం తెల్లజాతీయులకు పెద్ద నష్టాన్ని కలగజేసిందని నిపుణులు చెబుతున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.